Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలపై అలిగిన స్టార్ డైరెక్టర్!

By:  Tupaki Desk   |   16 Feb 2020 3:30 PM GMT
స్టార్ హీరోలపై అలిగిన స్టార్ డైరెక్టర్!
X
ఆయన ఓ టాప్ డైరెక్టర్. ఆయన సినిమా చేస్తానంటే చాలు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ నో చెప్పరు. ఆ డైరెక్టర్ స్థాయి అది. సక్సెస్ కోసం వెంపర్లాడే పరిస్థితి ఉన్న పరిశ్రమలో ఆయనకు సూపర్ ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే అలాంటి డైరెక్టర్ పరిస్థితి ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అయిపోయిందని టాక్ వినిపిస్తోంది.

ఈ స్టార్ డైరెక్టర్ ఊ అంటే చాలు డేట్స్ ఇచ్చే హీరోలు ఉన్నప్పటికీ వారితో చెయ్యకుండా ఓ పెద్ద స్టార్ తో సినిమా తెరకెక్కించాలని కంకణం కట్టుకున్నాడు. ఆ పెద్ద స్టార్ కూడా ఈ ఆసక్తిని గమనించి ఒప్పుకున్నాడు. అయితే ఇప్పటికే రెండేళ్ళయింది. సినిమా పదిశాతం కూడా పూర్తి కాలేదు. రెండేళ్ళలో అధికభాగం ఆ దర్శకుడు వేచి చూడడానికే సరిపోయింది. సరే ఇప్పటికైనా సినిమా షూటింగ్ ప్రారంభం అయింది కదా త్వరగా పూర్తి చేయాలని అనుకుంటే అదీ కుదరడం లేదు. ఈ సినిమాలో స్టార్ హీరో తనయుడు నటించాల్సి ఉంది. ఆయనేమో మరో సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయితే కానీ ఈ సినిమాలో నటించడు. అది రిలీజ్ అయిన తర్వాతే ఈ సినిమా రిలీజ్ చెయ్యాలనే ఒప్పందం ఉందట. ఆ భారీ ప్రాజెక్టు వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో మన స్టార్ డైరెక్టర్ కు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదట.

ఇప్పటికే రెండేళ్ళు వృథా అయింది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానీ రిలీజ్ అయ్యేలా లేదు. ఇప్పుడు ఈ సినిమాను మధ్యలో వదిలెయ్యలేడు. అలా అని చేస్తూ కూర్చుంటే వచ్చే ఏడాది కాదు కదా మరో ఏడాది కూడా తీసుకునేలా ఉన్నారని భయపడుతున్నారట. జేమ్స్ కామెరూన్ కూడా అవతార్ సినిమాకు ఇంత సమయం తీసుకుని ఉండరని.. ఈ సాధారణ షుగర్ కోటింగ్ కమర్షియల్ సినిమాకు మూడేళ్ళు నాలుగేళ్ళు ఏంటని సన్నిహితులు అంటున్నారట. ఈ డైరెక్టర్ కూడా తన సమయం వేస్ట్ అయిందని వాపోతున్నాడట. ఆ స్టార్ హీరోలపై అలిగాడట. మరి ఈ అలకను ఆ హీరోలు గమనిస్తారో లేదో!