Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్‌ ఆర్డ‌ర్‌.. హీరోయిన్ కు ఛాన్స్‌!

By:  Tupaki Desk   |   27 Jun 2022 8:30 AM GMT
స్టార్ డైరెక్ట‌ర్‌ ఆర్డ‌ర్‌.. హీరోయిన్ కు ఛాన్స్‌!
X
ఇండ‌స్ట్రీ ఎంత రంగుల ప్ర‌పంచం అయినా.. టాలెంట్ కే పెద్ద పీట వేస్తామ‌ని స్టేట్ మెంట్ లు ఇచ్చినా ఇక్క‌డ కూడా పైర‌వీలు.. సిఫార‌సులు వెరీ కామ‌న్‌. అవే ఇక్క‌డ చాలా మందికి అవ‌కాశాల్ని అందిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ స్టార్ డైరెక్ట‌ర్.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఓ హీరోయిన్ ని సిఫార‌సు చేయ‌డం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

పైగా ఆయ‌న సిఫార‌సు చేస్తే అవ‌కాశం ఇవ్వ‌కుండా వుంటారా? అంతే అన్నీ తానై వెన‌కుండి న‌డిపిస్తున్న ప్రాజెక్ట్ అది.. అందులో యంగ్ హీరో పాత్ర‌కు జోడీగా ఓ హీరోయిన్ ని స్టార్ డైరెక్ట‌ర్ సిఫారుసు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్ లో కొత్త సినిమా ఇటీవ‌ల సైలెంట్ గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి తెర‌కెక్కించిన త‌మిళ చిత్రం `వినోదాయ సితం` ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దైవ దూత‌కు, ఓ సామాన్యుడికి మథ్య సాగే క‌థ‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ అన్నీ తానై ఈ ప్రాజెక్ట్ ని వెన‌కుండా న‌డిపించ‌బోతున్నారు. స్టోరీలోనూ తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేర్పులు చేశారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది.

ఈ నేప‌థ్యంలో ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా `భీమ్లానాయ‌క్‌` ఫేమ్ సంయుక్త మీన‌న్ ని ఎంపిక చేశార‌ట‌. త్రివిక్ర‌మ్ సిఫార‌సు చేయ‌డం వ‌ల్లే త‌న‌కు ఈ మూవీలో అవ‌కాశం ఇచ్చార‌ని ఇన్ సైడ్ టాక్‌.

`భీమ్లానాయ‌క్‌` మూవీతో సంయుక్త మీన‌న్ తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి కూడా త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ మూవీలో న‌టించిన కార‌ణంగానే సంయుక్త మీన‌న్ కు త్రివిక్ర‌మ్ తాజా మూవీలో న‌టించే అవ‌కాశం క‌ల్పించార‌ని చెబుతున్నారు. అయితే దీనిపై అఫీషియ‌ల్ న్యూస్ బ‌య‌టికి రావాల్సి వుంది. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే నెల నుంచి ప్రారంభం కానున్న‌ట్టుగా తెలిసింది.