ప్రియుడితో స్టార్ డాటర్ లైవ్ ఫిట్నెస్ గోల్స్

Mon May 10 2021 08:00:01 GMT+0530 (IST)

Star Daughter Live Fitness Goals with Boyfriend

అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా వర్కౌట్ వీడియోలను పంచుకుంటున్నారు. ఇందులో తన ప్రియుడు నుపూర్ శిఖారే వర్కవుట్ చేసే విధానం .. అతడి ప్రతిభను అందరూ తెలుసుకునేందుకు అవకాశం ఉంది.ఆన్ లైన్ శిక్షణా సెషన్ కి సంబంధించి నూపూర్ ఒక కఠినమైన వ్యాయామం చేస్తున్న వీడియోని ఇరా ఇన్ స్టాలో పంచుకున్నారు. వీడియోలో అతను ప్లాంక్ పొజిషన్ లో నేలపై పడుకుని క్రమంగా పైకి లేస్తూ.. కుడి కాలిని ఎడమ వైపు నేలను తన బొటనవేలుతో తాకేలా చూస్తాడు. ఇది ఎంతో కష్టమైన వ్యాయామం.

ఆ వీడియో చూశాక.. ``ఈ వింత కదలికలు ఏమిటి?`` అంటూ ఇరా వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. నుపూర్ శిఖారే ప్లాంక్ కసరత్తుల వైవిధ్యం ఆకట్టుకుంది.

ఇది నూపూర్ స్కార్పియన్ ప్లాంక్ అని కూడా పిలుస్తారట. ఇది పలకల ఆధునిక రూపం. దీన్ని చేయడం ఎలానో నూపూర్ ఎంతో గొప్పగా చూపించారు. నుపూర్ గొప్ప ఫిట్ నెస్ ఔత్సాహికుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వేరొక వీడియోలో ఇంతకుముందు అతనితో ఇరా కిక్-బాక్సింగ్ చేస్తూ కనిపించింది. నేడు ఇరా బర్త్ డే సందర్భంగా అతడు ఎమోషనల్ గా ట్వీట్ చేస్తూ.. ఇంకా చాలా చాలా చెప్పాలనుంది. కానీ చెప్పలేకపోతున్నాను.. ఐ లవ్ యు అంటూ తన ప్రేమను కురిపించాడు. ఇరాఖాన్ ఒంటరితనం వల్ల డిప్రెషన్ ఎదుర్కొని అటుపై ఫిట్నెస్ క్లాసుల ద్వారా దాని నుంచి బయటపడేందుకు నూపూర్ సాయపడిన సంగతి తెలిసిందే. అమీర్ కి అతడే జిమ్ ట్రైనర్.