Begin typing your search above and press return to search.

2021 ఎండ్ లో స్టార్ డాటర్ డెబ్యూ మూవీ లాంచ్‌?

By:  Tupaki Desk   |   21 Feb 2021 3:30 PM GMT
2021 ఎండ్ లో స్టార్ డాటర్ డెబ్యూ మూవీ లాంచ్‌?
X
జాన్వీ కపూర్ సినీఎంట్రీ త‌ర్వాత త‌న‌ సోదరి ఖుషీ కపూర్ చాలా గ్యాప్ తీసుకుని ఇప్ప‌టికి క‌థానాయిక అవుతోంది. పాపా బోనీక‌పూర్ ఆ మేర‌కు పూర్తి స్థాయి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇప్ప‌టికే ఖుషీకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది ఆయన నుంచి. జాన్వీ.. ఖుషీ ఇద్ద‌రినీ స్టార్లుగా చూడాల‌న్న‌ది తొలి నుంచి బోనీ ఆలోచ‌న. మామ్ శ్రీ‌దేవి కూడా అదే కోరుకునేవారు. ఇప్పుడు ఆ కోరిక నెర‌వేరుతోంది.

జాన్వీ గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత ఖుషీ కోసం ఘ‌న‌మైన లాంచ్ ని బోనీ ప్లాన్ చేస్తున్నారు. మామ్ దీవెన‌లు పైనుంచి అందుతాయి. తాను క‌థానాయిక అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాకే ఇన్ స్టా లో ప‌బ్లిక్ కి ఓపెన్ అయ్యింది ఖుషీ. దాన‌ర్థం ఏడాదిలోగానే క‌థానాయిక అవుతున్నాన‌ని చెప్ప‌డ‌మేన‌ట. అంటే ఈ ఏడాది చివ‌రి నాటికి ఖుషీ డెబ్యూ మూవీ లాంచ్ అవుతుంద‌నే అభిమానులు భావిస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్ లో ఖుషీ తన ఇన్ ‌స్టాగ్రామ్ ‌ను పబ్లిక్ చేసింది. ఆమె 2015 నుండి ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ‌లో చురుకుగా ఉంది. తన సోదరి జాన్వి కపూర్ తో పోలిస్తే ఖుషీ ఈ వేదిక‌పై చాలా యాక్టివ్. సిస్ట‌ర్స్ ఇద్ద‌రూ గ్లామరస్ సెలబ్రిటీలుగా సోషల్ మీడియాలో తమ‌కంటూ ఒక సముచిత స్థానాన్ని అందుకున్నారు. శుక్రవారం ఖుషీ మ‌రో హాటెస్ట్ లుక్ ని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

``మీ కోసం ఆరోగ్యక‌ర‌మైన కంటెంట్` అన్న వ్యాఖ్య‌ను జోడించి ఫోటోల్ని షేర్ చేసింది. ఒక ఫోటోలో ఖుషీ తన వెనుక గోడపై పియానో అద్దం క‌నిపిస్తున్నాయి. రెండవ ఫోటోలో స్నేహితుల‌తో క‌లిసి క‌నిపించింది. వేరొక ఫోటోలో సోలోలో పోజులిచ్చింది. అన్ని చిత్రాలలో ఆమె క్లాస్సి బ్లాక్ బాడీకాన్ దుస్తులు ధరించింది. ఖుషీ ఫోటోల‌కు కజిన్ షానయ `అందం` అన్న వ్యాఖ్య‌ను జోడించ‌గా.. దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కూడా `అందగ‌త్తె` అని పొగిడేసింది.