బంగ్లాలు.. కొబ్బరి తోటలు కొనేస్తున్న స్టార్ కపూల్స్!

Tue Sep 14 2021 22:00:03 GMT+0530 (IST)

Bollywood Star Couples Ranveer Singh and Deepika Padukone

బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్-దీపిక పదుకొణే ఆదర్శ దంపతులుగా వెలిగిపోతున్నారు. ప్రోఫెషనల్ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత స్వేచ్ఛకు కొంత సమయాన్ని కేటాయిస్తూ ఫ్యామిలీ లైప్ ని ఎంత మాత్రం మిస్ కాలేదు. సమయం చిక్కినప్పుడు విదేశీ ట్రిప్పులతో జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు. అంతేనా స్టార్ కపుల్స్ రిటైర్మెంట్ తర్వాత జీవితం సంతోషంగా సాగిపోయేలా ప్రణాళిక బద్ధంగాను ముందుకు సాగిపోతున్నారు. ఇద్దరు బాలీవుడ్ లో బిజీ స్టార్స్. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రకటనల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఆ డబ్బుని కూడా తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు.వ్యాపారాలు చేయడమే కాకుండా కొన్ని బంగ్లాలు.. సాగర తీరాన కొబ్బరి తోటలు కొనేస్తున్నారు. ఇటీవలే ఈ జంట బెంగుళూరులో ఖరీదైన ప్లాట్ ను కొనుగోలు చేసి పెట్టారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ప్లాట్ నిర్మాణంలో ఉంది. నిర్మాణ దశ కావడంతో తక్కువ ధరకే దక్కించుకున్నారు. తాజాగా మహరాష్ట్రలోని అలీబాగ్ లోని ఓ కుగ్రామంలో ఓ ప్లాట్ ని కొనుగోలు చేసారు. అలాగే కోస్టల్ బెల్ట్ ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో కోబ్బరి తోటలు.. తమలపాకుల తోటల్ని కూడా కొనుగోలు చేసారుట. ఇవన్నీచాలా ఖరీదైన ఆస్తులేనని సమాచారం. భవిష్యత్ లో వాటి ధర మూడింతలు అవుతుందని.. ఆ ప్రాంతమంతా మరింత డెవలెప్ మెంట్ లోకి వస్తుందని .. అందుకే ముందుగానే ఈ జంట కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సోమవారం దీపిక-రణరవీర్ వీటి రిజిస్ట్రేషన్ విషయమై అలీబాగ్ కి వెళ్లారు. దీంతో అభిమానులు ఈ జంటను చూడటానికి తరలి వచ్చారు. ప్రేక్షకాభిమనులకు రణవీర్-దీపిక అభివాదం చేసి పని పూర్తి చేసుకుని వెళ్లారు. ప్రస్తుతం వీళ్లిద్దరు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న `83` లో నటిస్తున్నారు. మరో చిత్రంలో దీపిక అతిధి పాత్రలోనూ నటిస్తోంది. ఇంకా రణవీర్ వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

పీవీ సింధుతో బిజినెస్ డీల్ పై చర్చ

బాలీవుడ్ తారలు రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొనే ముంబైలో విందు కోసం ఒలింపిక్ పతక విజేత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుని కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ముంబై వర్లీలో ని రెస్టారెంట్ లో ఈ ముగ్గురూ లంచ్ చేశారు. లంచ్ పార్టీలో పాల్గొని అనంతరం ఫుల్ ఛీర్స్ మూడ్ లో కనిపించడంతో అంతా షాక్ తిన్నారు. ఉన్నట్టుండి సడెన్ గా ఇలా పీవీ సింధుతో లంచ్ పార్టీలేమిటీ? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఇంతలోనే ఈ కలయిక వెనక బిజినెస్ డీల్ ఉందంటూ ముంబై మీడియా కథనాలు వెలువరించింది.

పీవీ సింధు ఇటీవల టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన తర్వాత తన పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది. ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ కప్ లు గెలిచిన సింధు జీవితకథతో సినిమా తీస్తే అది యువతరంలో స్ఫూర్తి నింపుతుంది. నిర్మాతలకు బాక్సాఫీస్ కలశం నిండుతుంది. ఆ కోణంలో ఆలోచించిన దీప్ వీర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బిగ్ డీల్ కుదుర్చుకునేందుకు సింధుని లంచ్ కి ఆహ్వానించారు. యంగ్ స్పోర్ట్స్ లెజెండ్ సింధు జీవితంపై త్వరలో సినిమా తీయడానికి దీపిక ప్రయత్నిస్తోంది. దీపికా పదుకొనే తెరపై తన పాత్రను పోషించాలని కోరుకుంటున్నానని సింధుకు తెలిపారు. ఇప్పుడు సింధు బయోపిక్ లో నటిస్తూ స్వయంగా తనే నిర్మిస్తుందని పుకార్లు వినవస్తున్నాయి. ఇక ఈ బయోపిక్ తీస్తే లాభంలో వాటాల్ని పీవీ సింధుకి ఇస్తారట.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. దీపిక రణ్ వీర్ తో కబీర్ ఖాన్ 83 లో నటించింది. ఆమె ఇటీవలే శకున్ బాత్రా తదుపరి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆమె హృతిక్ రోషన్ తో ఫైటర్ లోనూ.. అమితాబ్ బచ్చన్‌తో ది ఇంటర్న్ రీమేక్ లోనూ కనిపిస్తుంది. పఠాన్ కోసం షారూఖ్ ఖాన్ తో ఈ స్టార్ తిరిగి కలుస్తోంది. మరోవైపు రణ్ వీర్ సింగ్ వరుస షూటింగులతో బిజీ. జయేశ్ భాయ్ జోర్దార్.. 83.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రాల్లో నటిస్తున్నాడు. శంకర్ అన్నియన్ రీమేక్ లో నటించాల్సి ఉంది. అతను సూర్యవంశీలో అతిధి పాత్రలో కూడా కనిపిస్తాడు.