స్టార్ కపుల్స్ మ్యారేజ్ ప్లాన్స్ లీక్

Thu Nov 25 2021 10:33:25 GMT+0530 (IST)

Star Couples Marriage Plans Leaked

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ మరియు స్టార్ హీరో విక్కీ కౌశల్ లు ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు ఇప్పటి వరకు తమ ప్రేమ విషయాన్ని వెళ్లడించలేదు. కాని ఖచ్చితంగా వీరిద్దరు త్వరలో ఒక్కటి కాబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.ఇప్పటి వరకు కనీసం తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్నే అధికారికంగా ఒప్పుకోని వీరు ఇప్పుడు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లుగా వస్తున్న వార్తలను కూడా కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన ఏమీ లేదు అన్నట్లుగానే పదే పదే ఇద్దరు కూడా చెబుతున్నారు.

ఒక వైపు వారు అలా ఏం లేదు.. ఇప్పుడే ఏం కాదు.. టైమ్ ఉంది అంటూ సింగిల్ వర్డ్ సమాధానాలు ఇస్తున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. వారి పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ పూర్తి అయ్యాయట.

ఇప్పటికే డేట్ లతో పాటు వెన్యూ ఇలా అన్ని కూడా రెడీ అయ్యాయట.కాని వారు మాత్రం ఇంకా వాటిని బయటకు రివీల్ చేయడం లేదు. తాజాగా అత్యంత సన్నిహితుల వద్ద వారు ఈ విషయాలను షేర్ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

అసలు విషయం ఏంటీ అంటే వీరిద్దరు మొదట ముంబయి కోర్టు లో రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారట. ఆ తర్వాత జైపూర్ లో భారీ ఎత్తున వీరి వివాహ వేడుక జరుగబోతుందని చెబుతున్నారు. ఇరు వర్గాల బంధు మిత్రులతో పాటు బాలీవుడ్ కు చెందిన కొంత మందికి ఇప్పటికే వీరు ఇన్విటేషన్ పంపించారని తెలుస్తోంది.

మొత్తానికి స్టార్ కపుల్ లవ్ మ్యారేజీకి సంబంధించిన పుకార్లు.. లీక్ లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కాని ఇప్పటి వరకు వారు మాత్రం ఏ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు. ముందు ముందు అయినా వారు నోరు విప్పుతారేమో చూడాలి.