స్టార్ యాక్టర్స్ మూవీ.. ఓటిటి రిలీజ్ కన్ఫర్మ్!

Fri Apr 23 2021 07:00:01 GMT+0530 (IST)

Star Actors Movie OTT Release Confirm!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్‌గన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' మూవీ  ఓటిటి రిలీజ్ సినిమాల జాబితాలో చేరింది. అభిషేక్ దుదైయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1971లో ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో రూపొందింది. అయితే ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతుందని ఇదివరకు టాక్ నడిచింది కానీ తాజాగా మేకర్స్ ఓటిటి రిలీజేనని ప్రకటించారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్ స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ పాత్రలో నటించగా.. సంజయ్ దత్ కేవలం కాలి వేలిముద్రలను చూసి జెండర్ హైట్ వెయిట్ గుర్తించగల రాంచోర్ దాస్ స్వభాయ్ రావరీ పాగి పాత్రలో నటిస్తున్నాడు. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో మద్రాస్ రెజిమెంట్ లెఫ్టినెంట్ కల్నల్ పాత్రను పోషించాడు.ఇండో-పాక్ యుద్ధం సమయంలో ధ్వంసమైన భుజ్‌లోని ఏకైక రన్‌వేను మరమ్మతు చేయడానికి సహకరించిన గుజరాత్ మాధపూర్‌కు చెందిన 300 మంది మహిళల ధైర్యాన్ని ఈ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా చూపించనుందని తెలిపాడు అజయ్ దేవగన్. రన్‌వే నిర్మాణానికి సహాయం చేయడానికి ఒప్పించిన మహిళా రైతు సుందర్‌బెన్ జేతా మాధర్పర్య అనే పాత్రను సోనాక్షి సిన్హా పోషించగా.. లాహోర్‌లో నివసిస్తున్న భారతీయ గూఢచారిగా పరిణితి చోప్రా కనిపిస్తుంది. తానాజీ సినిమా తర్వాత ఇదొక గొప్ప సినిమా అవుతుందని దేవగన్ చెప్పుకొచ్చాడు. తాజాగా భుజ్ మూవీ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగష్టు నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాను ఆగష్టు 13 లేదా 15 తేదీలలో ఏది అనేది కన్ఫర్మ్ కాలేదు. చూడాలి మరి మేకర్స్ ఏది ఫైనల్ చేస్తారో..!