మరోసారి శాస్త్రవేత్తగా మారబోతున్న స్టార్ హీరో

Fri Jul 01 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Star? hero about to become a scientist once again

విలక్షణ నటుడు సూర్య ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఇటీవల ఆయన చేసిన ఆకాశమే నీ హద్దురా.. జై భీమ్ సినిమాల్లోని పాత్రలకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు కమర్షియల్ గా మంచి విజయాలను దక్కించుకున్నాయి. వరుసగా సినిమాలు చేస్తున్న సూర్య తాజాగా ఆర్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాకు సిద్దం అయ్యాడు.సూర్య గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '24' అనే సినిమా లో శాస్త్రవేత్తగా కనిపించాడు. ఆ సినిమాలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను దర్శకుడు చూపించాడు. శాస్త్రవేత్తగా సూర్య లుక్ కు మంచి మార్కులు పడ్డాయి.

మళ్లీ ఇన్నాళ్లకు సూర్య శాస్త్రవేత్తగా మారబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

అందులో సూర్యను శాస్త్రవేత్తగా చూస్తామంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గతంలో విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సూర్య కోసం రెడీ చేసిన కథ చాలా బాగుందని.. సూర్య వెంటనే ఓకే చెప్పాడని కూడా తమిళ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. సూర్య మరియు రవికుమార్ ల కాంబో మూవీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా గా నిలుస్తుందని వారు నమ్ముతున్నారు.

ఈమద్య కాలంలో బయోపిక్ ల హవా కొనసాగుతుంది. ఇప్పుడు సూర్య కోసం రవికుమార్ రెడీ చేసిన కథ కూడా ఒక శాస్త్రవేత్త నిజ జీవిత కథ అయ్యి ఉండవచ్చు అంటున్నారు. ఇప్పటి వరకు దర్శకుడు ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేయలేదు. కాని అనఫిషియల్ గా ఎవరి జీవితాన్ని అయినా తీసుకున్నాడేమో తెలియాల్సి ఉంది.

సూర్య ఇటీవలే ఈటీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ గా తమిళనాట పర్వాలేదు అనిపించింది కాని తెలుగు లో మాత్రం నిరాశ పరిచింది. ఇక తాజాగా ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కమిటీ మెంబర్ గా సూర్య కు గౌరవం దక్కడంతో తమిళ సినీ ప్రేమికులతో పాటు అభిమానులు ఆనందం తో ఉన్నారు. ఇదే సమయంలో కొత్త సినిమా అప్డేట్ వారి యొక్క ఆనందం మరింతగా పెంచినట్లు అయ్యింది.