క్రేజీ జోడీతో స్టార్ డైరెక్టర్ లవ్ స్టోరీ

Mon Jan 17 2022 12:06:34 GMT+0530 (IST)

Star? Director? Love Story with Crazy Couple

జుగ్ జుగ్ జీయో సినిమాతో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రేజీ జోడీ కియారా అద్వానీ మరియు వరుణ్ దావన్ మరో సినిమాకు సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. జుగ్ జుగ్ జీయో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. సినిమా విడుదల అవ్వకుండానే క్రేజీ జోడీగా వీరిద్దరికి పేరు దక్కింది. ఆ సినిమాలో ఇద్దరి రొమాన్స్ మరియు కెమిస్ట్రీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. క్రేజీ జోడీగా పేరు దక్కించుకున్న వీరిద్దరితో దంగల్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన ఘనత నితీష్ తివారీకి ఉంది. అందుకే వీరిద్దరి కాంబోలో నితీష్ సినిమా అంటే ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా ఉన్నారు.కియారా అద్వానీ మరియు వరుణ్ దావన్ ల జుగు జుగ్ జీయో సినిమాలో కీలక పాత్రల్లో అనీల్ కపూర్ మరియు నీతూ కపూర్ లు నటించారు. రాజ్ మెహతా దర్శకత్వం వహించాడు. ఆ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కనుక ఖచ్చితంగా ఈ సినిమా మంచి వసూళ్లు దక్కించుకుంటుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలువబోతున్న ఆ సినిమా జోడీనే మళ్లీ దంగల్ దర్శకుడితో సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.

దంగల్ మరియు ఛిఛోరే సినిమాలో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకుడు నితీష్ తివారీ. విభిన్నమైన కాన్సెప్ట్ లను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకే ఈ సినిమా ను కూడా ఆయన విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆయన ఒక లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తాడనే వార్తలు వస్తున్నాయి. దంగల్ దర్శకుడు లవ్ స్టోరీ తీస్తే ఎలా ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆయన సినిమా లవ్ స్టోరీ అయినా విభిన్నంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగు లో రామ్ చరణ్ తో కలిసి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.