శృతి హాసన్.. సక్సెస్ వచ్చినా చప్పుడు లేదు!

Wed Jan 25 2023 06:00:01 GMT+0530 (India Standard Time)

Sruthi Hassan With Two Films Success

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొని మల్టీ టాలెంటెడ్ గా దూసుకుపోతున్న అందాల భామ శృతి హసన్. ఈ అమ్మడు సంక్రాంతి రేసులో వాల్తేర్ వీరయ్య సినిమాలో మెగాస్టార్ జోడీగా నటించింది అలాగే వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకి జోడీగా నటించింది. ఈ రెండు సినిమాలతో ఆమె సూపర్ సక్సెస్ లని తన ఖాతాలో వేసుకుంది. వాల్తేర్ వీరయ్య సినిమాలో శృతి హాసన్ కి కాస్తా పవర్ ఫుల్ రోల్ వచ్చిందని చెప్పాలి. అయితే ఈ రెండు సినిమాలు సక్సెస్ క్రెడిట్ మాత్రం ఎందుకనో శృతి హాసన్ కి ఆశించిన స్థాయిలో దక్కలేదని చెప్పాలి.వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న శృతి హాసన్ కి అక్కడ పెద్దగా హైప్ రాలేదు. తర్వాత అనారోగ్యం కారణంగా వాల్తేర్ వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ గా శృతి పాల్గొనలేదు. ఇక స్టేజ్ పైనే చిరంజీవి శృతి హాసన్ ఈవెంట్ లో పాల్గొనకపోవడంపై సెటైరికల్ లో కామెంట్స్ చేశాడు. ఇక ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కూడా శృతి హాసన్ పాల్గొన్నది తక్కువే అని చెప్పాలి వాల్తేర్ వీరయ్య ప్రమోషన్ అంతా చిరంజీవి మీదనే ఫోకస్ అయ్యింది. అయితే ఈ సినిమాల సక్సెస్ మీట్ లు తాజాగా జరిగాయి. అయితే అందులో సినిమా సక్సెస్ గురించి హీరోలు దర్శకులు గొప్పగా చెప్పారు.

అలాగే ఎవరికి వారు తమ సినిమాల విషయంలో అటు చిరంజీవిని ఇటు బాలకృష్ణని ఆకాశానికి ఎత్తేసారు తప్ప అందులో కీలక పాత్రలు చేసిన నటులకి మాత్రం ఆశించిన స్థాయిలో గౌరవం ఇవ్వలేదనే మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది.

వాల్తేర్ వీరయ్య సినిమాలో ప్రకాష్ రాజ్ తో పాటు బాబీ సింహా పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషించారు. నటులుగా వారి స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్ లో వారి ప్రస్తావన పెద్దగా లేదనే మాట వినిపిస్తుంది. ఇక శృతి హాసన్ గురించి కూడా పెద్దగా మాట్లాడలేదని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాల సెలబ్రేషన్స్ కి శృతి హాసన్ కావాలనే దూరంగా ఉందా అనే అనుమానం కూడా కలుగుతుంది. పెద్ద హీరోల సినిమాలు అంటే వారి భజన తప్ప మిగిలిన వారికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వరు. ఈ విషయం అర్ధమై శృతి హాసన్ సైలెంట్ అయిపోయినట్లుగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్.

మరి సీనియర్ స్టార్స్ విషయంలోనే శృతి హాసన్ కి పెద్దగా క్రెడిట్ రాకపోతే రేపు ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమా విషయంలో అయిన శృతి హాసన్ పేరు వినిపిస్తుందా సినిమా ఈవెంట్స్ లో ఆమెకి క్రెడిట్ ఇస్తారా అనేది ఇప్పుడు సందేహాస్పదంగా ఉంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.