షాడో మాన్ స్టర్ లోపలే ఉందంటున్న శృతి

Wed Jan 25 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Sruthi Hassan About Her Shadow Monster

కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సింగర్ మ్యూజిక్ కంపోజర్ రైటర్ యాక్టర్.. మొత్తానికి ఒక మల్టీ టాలెంటెడ్. హీరోయిన్ కాకముందే శృతి హాసన్ సింగర్ గా కెరీర్ మొదలు పెట్టి... అనేక స్టేజ్ షోలు ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ... ఇక సంక్రాంతికి తన ఖాతాలో రెండు హిట్స్ వేసుకుంది. వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య చిత్రాలతో సంక్రాంతి హీరోయిన్ అనిపించుకున్న శృతి... ఇద్దరు స్టార్ హీరోల సంక్రాంతి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఆ రెండు సినిమాల్లో శృతి పాత్ర అంతగా లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

ఇక తాజాగా ఆమె ఇన్స్టా లో ఒక పోస్ట్ పెట్టింది. తన బాల్యం టీనేజ్ ని గుర్తు చేసుకుంటూ .. అప్పటి ఫోటోలను షేర్ చేసింది. యంగ్ టీనేజ్ ప్రజెంట్ ఫోటోలు షేర్ చేసిన శృతి... అందులో ఓ ప్యాట్రన్ ఉందనీ చెప్పుకొచ్చింది. అలాగే 90ల నాటి జ్ఞాపకాలు తనని నీడలా వెంటాడుతూ ఉంటాయని క్యాప్షన్ లో రాసుకొచ్చింది.. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ శృతి ట్రాన్స్ఫర్మేషన్ చూసి షాక్ అవుతున్నారు.

 ఇక శృతి లవ్ ఎఫైర్ లో ఉందనే విషయం కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ లివింగ్ ఉంటున్నారు. ప్రస్తుతం శృతి హాసన్... సలార్ తో పాటు ఓ హాలీవుడ్ మూవీ చేస్తుంది. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.