ఆ రెంటిని పోల్చడమే తప్పు

Mon Sep 13 2021 22:00:01 GMT+0530 (IST)

Sruthi Hasan On Social Media

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కూతురుగా ప్రేక్షకులకు పరిచయం అయిన శృతి హాసన్ ఆ తర్వాత చాలా చాలా పేరు దక్కించుకుంది. కమల్ కూతురు గా కాకుండా శృతి హాసన్ గానే ఆమెకు ఇప్పుడు గుర్తింపు ఉంది. తాను ఒక స్టార్ కూతురును కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి.. మీడియా తనను టార్గెట్ చేస్తుంది అనే భయం అస్సలు ఆమెకు ఉండదు. ఆమె ఒక బోల్డ్. తాను అనుకున్నది చేస్తూ ముందుకు సాగే అమ్మాయి. పెళ్లి తో అవసరం ఏంటీ ఇప్పుడున్న సమస్యలు పరిష్కారం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు వాటి గురించి ఆలోచించుకోవాలి తప్ప పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ చాలా ముక్కు సూటిగా చెప్పేసిన ఆమె తాజాగా మరోసారి ఒక చిట్ చాట్ లో తన మనసులో విషయాన్ని చెప్పింది.సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఈమె అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించిన సమయంలో ఇప్పుడు ఆ మ్యాటర్ అంత ముఖ్యం కాదని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆమె చేసిన వ్యాఖ్యలు మరియు చెప్పిన విషయం అందరికి కన్విన్సింగ్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి ఆమె తన వాదన వినిపించింది. సెక్స్ మరియు ఫుడ్ విషయంలో మీరు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అంటూ ఒకరు ప్రశ్నించగా అందుకు సమాధానంగా ఫుడ్ అనేసింది. సెక్స్ లేకుంటే బతకవచ్చు.. కాని ఫుడ్ లేకుండా బతకలేము. ఆ రెండింటిని పోల్చడమే తప్పు అన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె సలార్ సినిమా లో ప్రభాస్ తో కలిసి నటిస్తోంది. అది మాత్రమే కాకుండా హిందీ మరియు తమిళంలో పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లను కూడా చేస్తున్న ఈమె నెట్టింట ఎప్పుడు కూడా సందడి చేస్తూనే ఉంటుంది. హాట్ ఫొటోలు మరియు వీడియోలను రెగ్యులర్ గా షేర్ చేసే ఈమె తన కొత్త ప్రియుడుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తన జీవితంను తనకు ఇష్టం ఉన్నట్లుగా జీవించాలని భావించే అమ్మాయి శృతి హాసన్. ఆమె చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరించడంతో పాటు ప్రతి విషయంలో కూడా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆమె సన్నిహితుల మాట.