క్లారిటీ లేకుండా ప్రెగ్నెంట్ హీరోయిన్ ఫోటో!

Wed Jul 17 2019 15:04:18 GMT+0530 (IST)

గర్భవతి అని తెలియగానే 'దిష్టి తగులుతుంది' అంటూ పేరెంట్స్ కాబోయే తల్లిని బయట ఎక్కువగా తిరగనిచ్చేవారు కాదు. అదంతా గతం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.  ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ కామన్ అయ్యాయి. కొద్దిరోజుల క్రితం అయితే సమీరా రెడ్డి ప్రెగ్నెంట్ గా అండర్ వాటర్ ఫోటో షూట్ చేసి సంచలనం సృష్టించింది.  తాజాగా మరో హీరోయిన్ కూడా తన బేబీ బంప్ ను ప్రదర్శించింది అయితే ఇదేమీ సమీరా లాగా సంచలనాత్మక ఫోటో షూట్ కాదు లెండి.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే శృతి హరిహరన్.  ఈమె పాపులర్ కన్నడ హీరోయిన్.  అలా చెప్తే మన తెలుగు ప్రేక్షకులకు గుర్తు రాదు కానీ యాక్షన్ కింగ్ అర్జున్ పై #మీటూ ఆరోపణలు చేసిన హీరోయిన్ అంటే చాలు.. టక్కున గుర్తుకు వచ్చేస్తుంది.  ఈ శృతి తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓ ఫోటో ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో శృతి ప్రెగ్నెంట్ గా కనిపిస్తోంది కానీ ఫోటో మాత్రం మసకగా ఉంది.  అలా ఎందుకు ఉందో శృతి కారణం కూడా చెప్పింది. "నీలో ఒక ప్రాణం గుండెసవ్వడిని ఫీల్ అయ్యేందుకు.. ఇది ఒక కొత్త ప్రయాణానికి ప్రారంభం అని తెలుసుకునేందుకు ఇదో సందర్భం. స్పష్టత అనేదాన్ని మరీ ఎక్కువ చేసి చూపుతున్నారేనే విషయాన్ని అంగీకరించాలి. ఒక్కోసారి అంతా అస్పష్టంగానే ఉంటుంది.  ఈ సర్కస్ కు స్వాగతం ఓ లిటిల్ పీనట్. నిన్ను చూసేందుకు మేము ఆతృతగా ఉన్నాం.  పిక్ కర్టసీ: నాన్న కాబోతున్న సూపర్ ఎగ్జైటెడ్ రామ్ కలరి." అంటూ పెద్ద క్యాప్షన్ ఇచ్చింది.

శృతి ఎక్కువగా కన్నడ చిత్రాల్లో నటించినప్పటికీ.. తమిళ..  మలయాళం సినిమాలో కూడా నటించింది.  తెలుగులో మాత్రమే నటించలేదు.   అర్జున్ 150 వ సినిమా 'నిబూనన్' షూటింగ్ సమయంలో లైంగిక వేధింపులకు గురయ్యానని ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది.  #మీటూ ఆరోపణల తర్వాత తనకు అవకాశాలు తగ్గాయని  తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా వెల్లడించింది.  ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండే ఫోటో షేర్ చేయడంతో నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.