శ్రీవిష్ణు 'రాజరాజచోర' మూవీ అప్డేట్స్.. డేట్ వచ్చేసింది!

Wed Jun 09 2021 20:00:02 GMT+0530 (IST)

Srivishnu Rajarajachora Movie Updates

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు.. కెరీర్ పరంగా చాలా తక్కువమంది దర్శకులతో వర్క్ చేసాడు. కానీ హీరోగా మొదటినుండి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఏడాది గాలిసంపత్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శ్రీవిష్ణు.. ఆ సినిమాతో హిట్ అందుకోలేకపోయాడు. మినిమం అంచనాలు సెట్ చేసినటువంటి ఆ సినిమా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఆ సినిమా ప్లాప్ తర్వాత శ్రీవిష్ణు తన సినిమాల గురించి పెద్దగా అప్డేట్ ఇవ్వలేదు. చాలా రోజుల తర్వాత తన తదుపరి సినిమా 'రాజరాజచోర' సినిమా గురించి అప్డేట్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలిపాడు..బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కూడా ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గంగవ్వ క్యారెక్టర్ నేమ్ అంజవ్వ కాగా ఆమె ద్వారానే అప్డేట్ గురించి ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో శ్రీవిష్ణు 'భాస్కర్ రాజు' అనే క్యారెక్టర్ లో కనిపించనుండగా.. శ్రీవిష్ణు సరసన హీరోయిన్స్ గా సునయన - మేఘా ఆకాశ్ నటిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు నటించిన మెంటల్ మదిలో - బ్రోచేవారెవరురా సినిమాలకు రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన హసిత్ గోలి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కొంతకాలంగా లేవు.

ఇంతవరకు కరోనా కారణంగా సైలెంట్ మైంటైన్ చేసిన మేకర్స్ ఇప్పుడిప్పుడే అప్డేట్స్ తో ప్రమోట్ చేసే ప్రణాళిక రెడీ చేసుకున్నారట. ఈ సినిమాలో శ్రీవిష్ణు -  బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వతో ఆ ప్రచార కార్యక్రమం ప్రారంభించనున్నారు. వీడియోలో.. రాజరాజచోర మూవీ అప్ డేట్స్ ఏవీ? అని భాస్కర్ పాత్ర పోషించిన శ్రీవిష్ణు అడిగితే.. నువ్వు లేకపోయినా వాటిని సిద్ధం చేశానంటూ ఇందులో అంజమ్మగా గంగవ్వ సమాధానం చెప్పింది. కాస్త మంచివి చూసి వదులు అని భాస్కర్ రిక్వెస్ట్ చేయడంతో.. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఈ జూన్ 11న వదలనున్నారు మేకర్స్. మరి ఇదివరకు రిలీజ్ చేస్తామన్న టీజర్ ఆ మధ్యలో ఆగిపోయింది. అయితే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా కీర్తిచౌదరి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.