శ్రీను వైట్ల ఎలాగైనా హిట్ కొట్టాలి!

Thu Nov 08 2018 13:33:45 GMT+0530 (IST)

Srinu Vaitla Hopes on Amar Akbar antony Movie

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ-ఇలియానా హీరో హీరోయిన్లు గా  నటించిన చిత్రం 'అమర్ అక్బర్ అంటోనీ'.  ఈ సినిమా నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా విజయం సాధించడం ఈ ప్రాజెక్టుతో ముడిపడిన వారందరికీ చాలా కీలకం కానుంది.  దర్శకుడు శ్రీను వైట్ల.. హీరో రవి తేజ.. హీరోయిన్ ఇలియానా.. నిర్మతలయిన మైత్రీవారు.. ఇలా అందరికీ ఈ సినిమా విజయం ఇంపార్టెంట్.  నాలుగు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్ల తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కనుక సక్సెస్ సాధించిన పక్షంలో ఇతర హీరోలు శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించేందుకు ఫ్యూచర్లో అయినా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా అటూ ఇటూ అయితే శ్రీను వైట్లకు నెక్స్ట్ సినిమాకు హీరో దొరకడం దాదాపు అసాధ్యమే.  గతంలో శ్రీను వైట్ల సినిమాలకు అమెరికాలో మంచి ఆదరణ ఉండేది. వరస ఫ్లాపులతో ఇప్పుడు యూఎస్ ఆడియన్స్ వైట్లను దాదాపు పట్టించుకోవడం మానేశారు. ఇప్పడు 'అమర్ అక్బర్ అంటోనీ' విషయంలో కూడా గట్టిగా ప్రమోషన్స్ చేస్తే గానీ ఓవర్సీస్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం కష్టం.

హీరో రవి తేజ కు వరసగా 'టచ్ చేసి చూడు'.. 'నేల టికెట్' రూపంలో రెండు డిజాస్టర్లు వచ్చాయి. ఇక ఈ సినిమా రిజల్ట్ తేడా కొడితే మాస్ రాజా మార్కెట్ స్టామినా మీద అనుమానాలు రావడం ఖాయం. కాబట్టి ఈ సినిమా ఎలాగైనా హిట్ కావలిసిందే.  హీరోయిన్ ఇలియానా విషయానికి వస్తే.. ఇప్పటికే హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుట్ అయింది. హిందీలో ఒకటి అరా సినిమాలు చేస్తున్నా తెలుగులో అసలు ఆఫర్లే లేవు. ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇల్లీ కి టాలీవుడ్ డోర్లు పూర్తిగా క్లోజ్ అయినట్టే.

లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. మైత్రీ బ్యానర్ కు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది.  హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో సంచలనం సృష్టించిన సంస్థ అది. కానీ 'సవ్యసాచి' పరాజయం తో వారికి పెద్ద బ్రేక్ పడింది. సినిమాకు కనీసం యావరేజ్ రెస్పాన్స్ కూడా రాకపోవడం ఆందోళన కలిగించే విషయమే.   చైతు ఇమేజ్ కంటే మైత్రీ వారి ఇమేజ్ నే ఈ సినిమా దెబ్బ తీసిందనడం లో ఏమాత్రం సందేహంలేదు.  ఇప్పుడు 'అమర్ అక్బర్ అంటోనీ' కనుక ఫ్లాప్ అయితే మైత్రీ బ్యానర్ కు బ్లాక్ బస్టర్ బ్యానర్ అనే ట్యాగ్ ఉండదు.  అది  కూడా టాలీవుడ్ లో ఇప్పటికే ఉన్న చాలా బ్యానర్లలో లో ఒకటిగా మిగిలిపోతుంది.  ఇలాంటి పరిస్థితిలో 'అమర్ అక్బర్ అంటోనీ' కి ప్రమోషన్స్ పై ఫోకస్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా ఉంటే యావరేజ్ గా ఉండాల్సిన సినిమాలు హిట్ రేంజ్ కి వెళ్ళిన ఉదాహరణలు గతంలో చాలా ఉన్నాయి.  ఇక రిలీజ్ కి వారం రోజులే ఉంది కాబట్టి మరి మైత్రీ వారు ఏం చేస్తారో వేచి చూడాలి.