తాను వేరే అమ్మాయి ప్రేమలో పడ్డట్లుగా సిరికే చెప్పిన శ్రీహాన్

Sun Nov 28 2021 23:35:13 GMT+0530 (IST)

Srihan In Biggboss

బిగ్ బాస్ ప్రతి సీజన్ ముగిసే సమయంకు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి వెళ్లడం.. వీకెండ్ ఎపిసోడ్స్ సందర్బంగా స్టేజ్ పైకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి వెళ్లడం జరిగింది. శని వారం ఎపిసోడ్ లో పలువురు కంటెస్టెంట్స్ స్నేహితులు మరియు సన్నిహితులు హాజరు అయ్యారు. సిరి ప్రియుడు కాబోయే భర్త శ్రీహాన్ హాజరు అయ్యాడు. ఆ సమయంలో సిరి కన్నీరు పెట్టుకుంది. చాలా రోజుల తర్వాత సిరిని చూసి శ్రీహాన్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇద్దరు కొన్ని నిమిషాలు అలా చూస్తూనే ఉండి పోయారు. ఆ సమయంలో శ్రీహాన్ మాట్లాడిన మాటలు మరియు సిరి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఎపిసోడ్ కు హైలైట్ గా నిలిచాయి.శ్రీహాన్ ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీహాన్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం నేను కొత్తగా ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాయి. ఆ అమ్మాయి నాకు ఇన్ స్టా గ్రామ్ లో కూడా రిప్లై ఇచ్చింది. మొదటి సారి నాకు ఇన్ స్టా లో రిప్లై ఇచ్చిన అమ్మాయి తనే.. తనను లవ్ చేస్తున్నట్లుగా సిరికి చెప్పాడు. శ్రీహాన్ ఒక సెకన్ పాటు కంగారు పెట్టాడు. ఆ వెంటనే తాను రవి అన్న కూతురు వియా తో తాను ప్రేమలో పడ్డట్లుగా క్యూట్ గా చెప్పాడు. వియా క్యూట్ నెస్ కు అంతా కూడా ఫిదా అయ్యారు. శ్రీహాన్ కూడా తాను వియాకు ఫ్యాన్ అయ్యాను. ఇన్ స్టా లో మెసేజ్ కూడా పెట్టానంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి శ్రీయాన్ చాలా సమయం సందడి చేశాడు.

సిరి మరియు శ్రీహాన్ ల మద్య సాగిన సంభాషణలు చాలా ఆసక్తిగా సాగాయి. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నట్లుగా మాట్లాడాడు. నా స్నేహితుడు షన్ను పై నమ్మకం ఉందని.. అతడు సిరికి అన్ని పరిస్థితుల్లో అండగా నిలిచాడంటూ సంతోషం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి కూడా శ్రీహాన్ అభినందనలు తెలియజేశాడు. మీ అందరు బాగా ఆడుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టాప్ లో సన్నీ ఉన్నాడంటూ శ్రీహాన్ చెప్పుకొచ్చాడు. షన్ను మరియు సిరిలు కూడా టాప్ 5 లో ఉంటారి నమ్మకంను శ్రీహాన్ వ్యక్తం చేశాడు.