Begin typing your search above and press return to search.

టైగర్ 3పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు

By:  Tupaki Desk   |   2 Feb 2023 7:00 PM GMT
టైగర్ 3పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కపోయే సినిమా టైగర్ 3. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. భారీ బడ్జెట్ తో సల్మాన్ ఖాన్ కెరియర్ లో హూజ్ ఎక్స్పెక్టేషన్స్ తెరకెక్కుతున్న సినిమా టైగర్ త్రీ అని దర్శకుడు శ్రీధర్ రాఘవన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఈ ఏడాది ఆరంభంలో షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని పఠాన్ మూవీ సొంతం చేసుకోడు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వారం రోజులు పూర్తయిన కూడా ఇప్పటికీ ఏ మాత్రం కలెక్షన్స్ డ్రాప్ కాకపోవడం ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు.

స్పైత్ థ్రిల్లర్ తెరకెక్కిన పఠాన్ మూవీ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుని చెప్పాలి. ఇక షారుక్ ఖాన్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాకు తెరకెక్కిన పఠాన్ మూవీ సొంతం చేసుకోవడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక శుభ పరిణామం చెప్పాలి.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతుంది ప్రచారంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్ సినిమా పడటం లేదు. ఇలాంటి సమయంలో పఠాన్ రూపంలో బ్లాక్ బాస్టర్ హిట్ హిందీ ఇండస్ట్రీకి లభించింది చెప్పాలి.

ఇప్పుడు ఈ సినిమా వేవ్ నీ కంటిన్యూ చేసే విధంగా స్పై థ్రిల్లర్ కథాంశం తోనే టైగర్ 3 సినిమా కూడా తెరకెక్కబోతూ ఉండడం విశేషం ఈ సినిమా పైన కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇప్పటికే టైగర్ సిరీస్ లో వచ్చిన మొదటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటికి మించి ఈ సినిమా ఉండబోతుందని దర్శకుడు శ్రీధర్ రాఘవన్ చెప్పడం ద్వారా మరిన్ని సంచలనాలు క్రియేట్ చేశాడని బి టౌన్ లో వినిపిస్తున్న మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.