Begin typing your search above and press return to search.

శ్రీ‌కాంత్ అడ్డాల సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడుగా!

By:  Tupaki Desk   |   7 Dec 2022 12:30 AM GMT
శ్రీ‌కాంత్ అడ్డాల సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడుగా!
X
'కొత్త బంగారు లోకం' మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్ర‌శంస‌లు సొంతం చేసుకున్న శ్రీ‌కాంత్ అడ్డాల ఆ త‌రువాత ఆ స్థాయి విజ‌యాల్ని ద‌క్కించుకోలేక‌పోతున్నాడు. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, విక్ట‌రీ వెంక‌టేష్ ల క‌ల‌యిక‌లో రూపొందించిన 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు'తో మంచి మార్కులే ద‌క్కించుకున్నాడు కానీ ఈ మూవీతో ఆశించిన స్థాయి ఫ‌లితాన్ని మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోయాడు.

కార‌ణం ఇందులో చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా క‌థ లేక‌పోవ‌డ‌మే. ఈ మూవీ త‌రువాత మ‌రోసారి మ‌హేష్ తో చేసిన 'బ్ర‌హ్మాత్స‌వం' ద‌ర్శ‌కుడిగా శ్రీ‌కాంత్ అడ్డాల‌కు చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది.

మెలో డ్రామాగా ఫ్యామిలీ అంశాల నేప‌థ్యంలో బంధాలు.. బంధుత్వాల స‌మాహారంగా భావోద్వేగాలే ప్ర‌ధానాంశంగా తెర‌కెక్కిన ఈ మూవీ శ్రీ‌కాంత్ అడ్డాల కెరీర్ లో అత్యంత డిజాస్ట‌ర్ గా నిలిచి దారుణ ఫ‌లితాన్ని అందించింది. 2016లో విడుద‌లైన ఈ మూవీ త‌రువాత శ్రీ‌కాంత్ అడ్డాల మ‌ళ్లీ సినిమా చేయ‌డానికి దాదాపు ఐదేళ్లు ప‌ట్టింది. మ‌ళ్లీ విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన 'నార‌ప్ప‌'తో స‌క్సెస్ ని ద‌క్కించుకుని ట్రాక్ లోకొచ్చాడు.

త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ 'అసుర‌న్' ఆధారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ఈ స‌క్సెస్ క్రెడిట్ మొత్తం హీరో వెంక‌టేష్ ఖాతాలోకే వెళ్లిపోయింది. దీంతో పెద్ద స్టార్ హీరో ఎవ‌రూ శ్రీ‌కాంత్ అడ్డాల‌తో ప‌ని చేయ‌డానికి ముందుకు రాలేదు.

ఈ నేప‌థ్యంలో శ్రీ‌కాంత్ అడ్డాల ప్ర‌స్తుతం 'అఖండ‌' సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న‌ స్టార్ ప్రొడ్యూస‌ర్ మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి బావ‌మ‌రిదిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఓ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు.

దీనికి సంబంధించిన షూటింగ్ ఇటీవ‌లే సైలెంట్ గా మొద‌లైంది. చ‌డి చ‌ప్పుడు కాకుండా సైలెంట్ గా ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక అప్ డేట్ ని విడుద‌ల చేసే అవ‌కాశం వుందని, ఈ మూవీ త‌రువాత శ్రీ‌కాంత్ అడ్డాల స్టార్ హీరోల‌తో మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ కు శ్రీ‌కారం చుట్టే అవ‌కాశం వుందని ఇన్ సైడ్ టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.