పూనమ్ కౌర్ పీకే లవ్.. శ్రీరెడ్డి పంచ్!

Thu May 28 2020 17:20:12 GMT+0530 (IST)

Poonam Kaur PK Love .. Sri Reddy Punch!

న్యూసులన్నీ ఫాలో అవుతూ ఉండేవారికి శ్రీరెడ్డి ఎవరో ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఒక్కోసారి మసాలా వ్యాఖ్యలు.. మరోసారి వివాదాస్పదమైన అభిప్రాయాలు వ్యక్తం చేసే శ్రీరెడ్డి తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పై ఓ పంచ్ వేసింది.పూనమ్ కౌర్ తెలుసు కదా.. సినిమాల్లో సాధించిన గుర్తింపు కంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో ఆమె ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. కొంతకాలం క్రితం పవన్ పై విమర్శలు.. ఆరోపణలు చేస్తూ కత్తి మహేష్ పూనమ్ కౌర్ పేరును మధ్యలోకి తీసుకొచ్చాడు. అప్పటి నుండి పూనమ్ పాపులర్ అయింది. పూనమ్ ట్వీట్లు మానవమాత్రులకు అర్థం అయ్యేలా ఉండవు. ఏదో చెప్పాలనుకుని మరేదో చెప్తూ ఇంకేదో అర్థం అయ్యేలా చేస్తుంది పూనమ్. ఆమె పరోక్షంగా వేసే ట్వీట్లను జనాలు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు..

ఈమధ్య ట్విట్టర్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో 'పీకే లవ్'(PK love) అనే ఒక మాస్క్ ధరించింది. తనకు ఎవరో అభిమానులు తన సిగ్నేచర్ అయిన నాలుగు పీకే లవ్ మాస్కులను ఇచ్చారని చెప్పింది. పూనమ్ కౌర్ అంటే పీ.కే అని ఇంగ్లీష్ అక్షరాలలో అంటారు కదా. అలా అన్నమాట. కానీ జనాలకు పీకే అంటే పవన్ కళ్యాణ్ అనే ఆలోచనే వస్తుంది.. పూనమ్ కౌర్ అని ఎవ్వరూ అనుకోరు. అసలే పూనమ్ అప్పుడప్పుడు పవన్ పై పరోక్షంగా ట్వీట్లు వేస్తుందని అంటూ ఉంటారు. దీంతో ఇది కూడా పవన్ మీద వేసిన ట్వీట్ అని చాలామంది భావించారు.

శ్రీరెడ్డికి ఇదే అనిపించిందేమో.. వెంటనే "పూనమ్ అక్కా.. PK మాస్క్ వేసుకోవడం ఎందుకు?? మా అందరికీ పీకే కి ఉన్న మాస్క్ తీసెయ్ అంటే తీయవు.. మాస్క్ కే పీఛే క్యా హై??" అంటూ పంచ్ వేసింది. అయితే శ్రీరెడ్డి పోస్టుకు ఇంకా పూనమ్ స్పందించలేదు. ఆయినా ఈ మాస్క్ వ్యవహారం ఇంకా ఎంతదూరం పోతుందో ఏమో!