రెండో సినిమాకి రెడీ అయిన కీరవాణి కొడుకు

Sat Oct 17 2020 11:15:52 GMT+0530 (IST)

Keeravani's son who is ready for the second movie

అన్నం ఉడికిందా లేదా? అని చెప్పేందుకు రెండు మెతుకులు చాలు. కుర్రాడిలో ట్యాలెంట్ ఉందా లేదా గ్రహించేందుకు ఒక సినిమా చాలు. ఆరంభ సినిమాతోనే మరకతమణి ఎం.ఎం. కీరవాణి వారసుడు శ్రీసింహా పక్కింటబ్బాయి లుక్ తో టెంపరితనం ఉన్న కుర్రాడిగా ఫర్వాలేదనిపించాడు. బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా టాలీవుడ్ లో అతడి కెరీర్ గురించి శంకించాల్సిన పనే లేదు.జక్కన్న అంతటివాడి అండ ఉంది కాబట్టి ఈ వారసుడికి మంచి స్క్రిప్టు ఎంపికలు ఉంటాయని అంచనా వేయొచ్చు. శ్రీసింహా ఆరంభమే అదిరిపోయే స్క్రిప్టు సెలెక్షన్ తో ఆకట్టుకున్నాడు. ఈ మూవీని కొత్త కుర్రాడు దర్శకత్వం వహించినా రాజమౌళి ఇన్విజిలేషన్ తో పరిపక్వతతో ఔట్ పుట్ బయటికి వచ్చింది. ఇక మత్తువదలరా తర్వాత శ్రీసింహా నటిస్తున్న సినిమా ఏది? అంటే..

ఆరంగేట్రం.. మత్తువదలరా అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన శ్రీ సింహా ఇప్పుడు తన రెండో సినిమాకు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా తెలిసింది. ఓ నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. ఇక ఇందులో కాస్టింగ్ ఎవరెవరు? ఇతరత్రా వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నారని ఫిలింనగర్ వర్గాల ద్వారా తెలిసింది. తొలి సినిమా ప్రారంభమయ్యాక 3నెలల నటశిక్షణ తీసుకున్న శ్రీసింహా నటుడిగా నేచురల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రెండో సినిమాతోనూ మత్తు వదిలిస్తాడా లేదా? అన్నది చూడాలి.