Begin typing your search above and press return to search.

ఒక్కరోజు ఆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతకు భార్యగా ఉన్నా చాలన్న శ్రీరెడ్డి

By:  Tupaki Desk   |   13 Oct 2019 5:41 AM GMT
ఒక్కరోజు ఆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతకు భార్యగా ఉన్నా చాలన్న శ్రీరెడ్డి
X
వివాదాలకు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే టాలీవుడ్ నటి శ్రీరెడ్డి తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమె తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన వ్యాఖ్య చేసి అందరు తనవైపు చూసేలా చేయటమేకాదు.. ఆమె మాటలు సినీ.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో టాప్ లెస్ గా నిరసనతో ఒక్కసారిగా సంచలన సెలబ్రిటీగా మారిన ఆమె.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో పాటు పలువురు సినీ ప్రముఖుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

హైదరాబాద్ నుంచి చెన్నై మకాం మార్చిన ఆమె.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక యువనేత గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కొత్త కలకలానికి కారణంగా మారాయి. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ కు ఒక్కరోజు భార్యగా ఉన్నా చాలని.. ఆ తర్వాత చనిపోయిన ఫర్లేదంటూ ఫేస్ బుక్ లో ఆమె చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ గా మారుతోంది.

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. బైరెడ్డి సిద్దార్థ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేత అని.. అలాంటి వ్యక్తి మీద శ్రీరెడ్డి చేసేవ్యాఖ్యలు అతని పొలిటికల్ కెరీర్ ను దెబ్బ తీస్తాయన్న మాట వినిపిస్తోంది. బైరెడ్డి సిద్ధార్థ్ ను వదిలేసి.. పవన్ ను ట్రై చేస్తే మంచిదంటూ కొందరు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఇంతకీ ఈ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఎవరో కాదు.. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత పలు పార్టీలు మారిన బైరెడ్డి రాజేశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడే సిద్ధార్థ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అరంగ్రేటం చేసిన అతడు.. జగన్ చేతుల మీద పార్టీ కండువా కప్పించుకొని పార్టీలో చేరారు. బైరెడ్డి సిద్ధార్థ్ కు ఫైర్ బ్రాండ్ అన్న పేరుంది. ఇదిలా ఉంటే.. బైరెడ్డిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు శ్రీరెడ్డి.

తొలిసారి తన పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నానని చెప్పిన ఆమె.. నువ్వు మగాడివిరా బుజ్జీ అంటూ తనకున్న ప్రేమను పొంగించేసిన శ్రీరెడ్డి.. ఒక్కరోజైనా ఆయనకు భార్యగా ఉంటే చాలు.. తర్వాత చనిపోయినా ఫర్లేదన్న కామెంట్ చేశారు.శ్రీరెడ్డి వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇంతకీ వీరిద్దరికి పరిచయం ఎక్కడ జరిగింది? దీనిపై బైరెడ్డి సిద్ధార్థ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.