ఎన్ కౌంటర్ తో పవన్ కి ముడిపెట్టిందే!

Fri Dec 06 2019 18:27:25 GMT+0530 (IST)

Sri Reddy Targets Pawan kalyan Over Disha murder Accused Encounter

దిశ హత్యాచార ఘటన అనంతరం పరిణామాలు.. శుక్రవారం తెల్లవారు ఝామున హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో నిందితుల ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. నలుగురు నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సామాన్య జనాలు సహా సెలబ్రిటీలు అనూహ్యంగా స్పందించారు. ఈ ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల్ని.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వగతించారు.తాజాగా ఈ ఘటనపై స్పందించిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి పోలీసుల్ని.. తెలంగాణ ప్రభుత్వాన్ని .. కేసీఆర్ ని పొగిడేస్తూ.. ఊహించని కామెంట్ తో జనసేనాని పవన్ కల్యాణ్ పై విరుచుకుపడింది. టైమ్ చూసి.. అదును చూసి పవన్ బహుభార్యత్వంపై విరుచుకుపడింది.

శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఈ ఘటనను పేర్కొంటూ.. పవన్ కల్యాణ్ పై తీవ్ర పదజాలంతో ఓ వ్యాఖ్యను పోస్ట్ చేసింది. ఆ నలుగురు రేపిస్టులను ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్. ఈ ఎన్కౌంటర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. జై కెసీఆర్!! అంటూనే మరో విన్నపం చేసింది. ఎవరైతే పీకే లాగా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారో వాళ్ళను కూడా ఎన్ కౌంటర్ చేసేయాలి. ఏపీ పోలీసులకు ఇదే నా విన్నపం!! అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసింది. ప్రస్తుతం  ఈ తీవ్ర వ్యాఖ్య పీఎస్ పీకే ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. దీంతో శ్రీరెడ్డికి సామాజిక మాధ్యమాల వేదికగా కౌంటర్లతో పీకే ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. పవన్ పెళ్లిల్లు చేసుకున్నాడు కానీ.. నీలా అలాంటి పనులు చేయడం లేదు! కదా అంటూ డైరెక్టుగానే కామెంట్లతో విరుచుకుపడడం వేడెక్కిస్తోంది.