శ్రీరెడ్డి ఫస్ట్ నైట్ ఆ స్టూడియోలోనే!

Wed Feb 19 2020 12:21:33 GMT+0530 (IST)

Sri Reddy Sensational Comments on Her Firsy Night

వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం నటి శ్రీరెడ్డి స్పెషాలిటీ. `మా` ఆఫీస్ ముందే అర్ధనగ్న షోతో జాతీయ మీడియాకి ఎక్కేసిన శ్రీరెడ్డి టాలీవుడ్.. కోలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం చెన్నైలో తిష్ట వేసి హైదరాబాద్ లో  కార్యకలాపాలన్నింటినీ నడిపిస్తుంది. చెన్నై వెళ్లిపోయినా మనసంతా టాలీవుడ్ సినిమాలపైనా..హైదరాబాద్ పైనే ఉంది. ఇప్పటికి తన ఫేస్ బుక్ పేజీలో అప్పుడప్పుడు హాట్ హాట్ కామెంట్లో మీడియా అటెన్షన్ డ్రా చేస్తోంది.  తాజాగా మరో సంచలన వ్యాఖ్యతో విరుచుకుపడింది అంటూ  సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.  ఆ కామెంట్ వింటే హవ్వా అని! ..నోళ్లు నొక్కుకోవాల్సిందే అంటూ నెటిజనుల్లో చర్చ సాగుతోంది.ఇంతకీ శ్రీరెడ్డి ఏమని కామెంట్ చేసింది? ఎవరినుద్ధేశించి నోరు జారింది? అంటే... అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ ని రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కి ఇచ్చేసారని ప్రచారమైన సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో శర వేగంగా అభివృద్ది జరుగుతున్న ప్రాంతం కావడంతో ఇప్పుడు స్టూడియోని తీసేసి ..రియల్ వెంచర్ కి ఇచ్చేసారట.  అక్కడ కాలనీ ఏర్పడుతోంది. ఇదే అదునుగా భావించిన శ్రీరెడ్డి ఓ హాట్ కామెంట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసిందట. ``ఎక్కడైతే నాకు..అభిరామ్ కు ఫస్ట్ నైట్ అయ్యిందో? అదే రామానాయుడు స్టూడియో త్వరలో కనుమరుగవుతోంది`` అంటూ పోస్ట్ పెట్టిందట.

ఆ పోస్ట్ మరి కొద్ది సేపట్లోనే మాయమైంది. అయితే అప్పటికే నెటిజనుల్లో ఆ కామెంట్ వైరల్ అయిపోవడంతో రకరకాల కామెట్లు రిప్లయ్ లు కనిపించాయి.  పోస్ట్ వైరల్ అవ్వడంతో ఆ తరువాత వెంటనే డిలీట్ చేసిందని ప్రచారం జరుగుతోంది. దగ్గుబాటి అభిరామ్ వ్యవహారంపై అప్పట్లో బోలెడంత రచ్చ చేసింది. దానికి కొనసాగింపుగా మళ్లీ శ్రీరెడ్డి ఇలా రచ్చ చేయడంపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయ్.