శ్రీముఖి ఫ్యామిలీతో కొత్త ఆరంభం

Thu Dec 03 2020 21:14:13 GMT+0530 (IST)

New beginning with Srimukhi family

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన శ్రీముఖి బిగ్ బాస్ తో మరింత పాపులారిటీని దక్కించుకుంది. సినిమాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నా కూడా ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్న ఈమె ప్రస్తుతం కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. ఒక వైపు బుల్లి తెర షోలకు హోస్టింగ్ చేయడంతో పాటు.. సొంత యూట్యూబ్ లో సందడి చేస్తోంది. ఇదే సమయంలో క్రేజీ అంకుల్స్ అనే ప్రాజెక్ట్ ను చేస్తోంది. ఇది ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. కెరీర్ పరంగా చాలా జోరు మీదున్న శ్రీముఖి డబ్బుల విషయంలో కూడా కొదవ లేకుండా ఉన్నట్లుగా ఉంది. గత బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న శ్రీముఖి కి విన్నర్ గా నిలిచిన రాహుల్ కంటే ఎక్కువగా దక్కినట్లుగా వార్తలు వచ్చాయి.ఈ సమయంలో శ్రీముఖి తనకొత్త ఇంటిని ప్రారంభించింది. తాజాగా ద్వారం ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించింది. అమ్మ నాన్న సోదరుడితో కలిసి శ్రీముఖి ఈ కార్యక్రమంలో పాల్గొంది. అందుకు సంబంధించిన ఫొటోలను శ్రీముఖి సోసల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. శ్రీముఖి అభిమానులు కొత్త జర్నికి శుభాకాంక్షలు తెలియజేయగా కొందరు మాత్రం ఆమె బాగా సంపాదిస్తున్నట్లుగా ఏవో ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. మొత్తానికి ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. శ్రీముఖి ఫ్యామిలీ మొత్తం ఇలా కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కనుక నెటిజన్స్ ఈ ఫొటోలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరీ చూస్తున్నారు.

TAGS: Sreemukhi