శ్రీముఖి.... ఆ డ్రెస్ ఏంటి నువ్వు మాట్లాడుతున్నదేంటీ?

Sun May 15 2022 16:09:52 GMT+0530 (IST)

Sreemukhi In Instagram

బుల్లి తెరపై యాంకర్ గా స్టార్ డమ్ ను దక్కించుకున్న శ్రీముఖి అప్పుడప్పుడు వెండి తెరపై కూడా మెరిసి మరింత పాపులారిటీని దక్కించుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా కూడా ఆఫర్లు దక్కించుకున్న శ్రీముఖి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో వరుసగా హాట్  ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. బాబోయ్ శ్రీముఖి ఏంటీ ఈ రచ్చ అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.తాజాగా శ్రీముఖి ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో ఆమె వేసుకున్న డ్రస్ గురించి చర్చ జరగడంతో పాటు.. వీడియోలో ఆమె మాట్లాడిన టాపిక్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నాలుగు మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ఉన్న శ్రీముఖి సోషల్ మీడియాలో ఒక కమర్షియల్ పోస్ట్ చేస్తే లక్షల్లో పారితోషికం తీసుకుంటూ ఉంది. తాజాగా ఒక బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేస్తూ వీడియోను షేర్ చేసింది.

క్లీ వేజ్ షో తో మతులు పోగొడుతున్న శ్రీముఖి డ్రస్ గురించి కొందరు విమర్శలు (ట్రోల్ ) చేస్తే మెజార్టీ మెంబర్స్ ఆమె యొక్క డ్రస్ కు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మొత్తానికి ఆడ్రస్ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు.

ఇక ఆమె ప్రమోట్ చేసిన యాప్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. బెట్టింగ్ అనేది చాలా నష్టం కలిగించే అంశం. ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ విషయంలో నష్టపోతున్నట్లుగా చెబుతూ ఉంటారు. అలాంటి బెట్టింగ్ యాప్ గురించి పబ్లిసిటీ అయ్యేలా మాట్లాడటం ఖచ్చితంగా జనాలకు తప్పుడు దారి చూపించడం అవుతుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక ప్రముఖ సెలబ్రెటీ అయ్యి ఉండి... నాలుగు మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్న శ్రీముఖి ఇలాంటి ఒక చెడు అలవాటు ను కలిగించే యాప్ గురించి మాట్లాడటం మంచిది కాదు అనేది కొందరి అభిప్రాయం. డబ్బు కోసం దేనికైనా ప్రమోషన్ చేస్తావా అంటూ కొందరు ప్రశ్నిస్తే కొందరు మాత్రం శ్రీముఖి ని సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.