సామ్ స్కూల్ కి మెగా మనవరాలు అంబాసిడరా?

Wed Feb 26 2020 10:15:21 GMT+0530 (IST)

Sreeja daughter Navishka at Samantha EKAM school

అక్కినేని కోడలు సమంత స్కూల్ బిజినెస్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇటీవలే EKAM లెర్నింగ్ సెంటర్ పేరుతో హై క్లాస్ ప్లే స్కూల్ ని ప్రారంభించారు. డిజైనర్ శిల్పారెడ్డి భాగస్వామ్యంలో సామ్ ప్రారంభించిన ఈ ప్లే స్కూల్ కి సెలబ్రిటీ ప్రపంచం నుంచి అద్భుత స్పందన వస్తోందిట.ఫిబ్రవరి 22 న EKAM లెర్నింగ్ సెంటర్ టాప్ సెలబ్రిటీల మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం లో మెగాస్టార్ చిరంజీవి మనవరాలు.. శ్రీజ కుమార్తె నవిష్క జగన్ సందడి హైలైట్ గా నిలిచింది. ఆ వీడియో తాజాగా అంతర్జాలంలో వరల్ అవుతోంది. క్యూట్ బేబి నవిష్క ఏకం సెంటర్ లో ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

మెగాస్టార్ మనవరాలు క్యూట్ లుక్ పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సమంత స్కూల్ కి మెగా మనవరాలు బ్రాండ్ అంబాసిడరా? అంటూ పొగిడేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అప్పటి ప్రారంభోత్సవంలో శ్రీజ మాట్లాడుతూ.. `ఏకం` స్కూల్ తన హృదయాన్ని హత్తుకుందని.. సమయం దొరికినప్పుడల్లా తన కుమార్తెను ఇక్కడికి తీసుకువస్తానని శ్రీజా చెప్పారు. ఈ కార్యక్రమంలో సమంత- శిల్పారెడ్డి సహా పలువురు టాప్ సెలబ్రిటీలు సందడి చేశారు.