వీడియో : అన్నపూర్ణతో ప్రేమను షేర్ చేసుకున్న శ్రీజ కళ్యాణ్

Mon May 25 2020 14:04:21 GMT+0530 (IST)

Video: Sreeja Kalyan shares love with Annapurna

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మరియు ఆమె భర్త కళ్యాణ్ లు అన్నపూర్ణ గోధుమ పిండి ప్రమోషన్ చేస్తూ తమ ప్రేమను నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు. శ్రీజ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో శ్రీజ కోసం కళ్యాణ్ లంచ్ గా చెపాతీ తయారు చేసి పెట్టాడు. అయితే ఆ చెపాతీలు రకరకాల షేప్స్ లో రావడంతో శ్రీజ నవ్వుతూ ప్రేమతో చేస్తే ఎలా ఉన్నా బాగుంటుందని ఆమె అంటూ చెపాతీలు తింటుంది.మీరు కూడా ఇలా రకరకాల షేప్స్ తో చెపాతీలను తయారు చేసి వీడియోలు ఫొటోలు మాతో షేర్ చేసుకోండి. మేము ఆ వీడియోలు ఫొటోలు స్టోరీగా పోస్ట్ చేస్తామంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ వీడియోలో కళ్యాణ్ మరియు శ్రీజల ప్రేమ చూడటంతో పాటు అన్నపూర్ణ గోధుమ పిండికి ప్రమోషన్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా కళ్యాణ్ దేవ్ ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు. విజేత చిత్రంతో కళ్యాణ్ దేవ్ ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా నిరాశ పర్చింది. సెకండ్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయినా కూడా కరోనా వల్ల ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న కళ్యాణ్ దేవ్ ఇలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ దృష్టిలో పడుతూ ఉంటాడు.