శ్రీజ మొగుడు.. ఏమన్నా ఇచ్చాడా! ఎక్స్‌ప్రెషన్స్.. వీడియో వైరల్

Mon Oct 19 2020 17:00:54 GMT+0530 (IST)

Sreeja Husband Expressions .. Video Viral

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ దేవ్ చూడ చక్కని జంటగా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా మెలుగుతుంటారు. దేవ్ బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీజను కూడా వెంట తీసుకెళ్తుంటారు. శ్రీజ గారాల పట్టిని ప్రేమగా చూసుకుంటాడు. శ్రీజ కళ్యాణ్ దేవ్ ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. తమ లైఫ్ కి సంబంధించిన విశేషాలను  అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ కళ్లతో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ పై  ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది విపరీతంగా వైరల్ అవుతోంది.


శ్రీజ  సోమవారం ఉదయం  ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇందులో కల్యాణ్‌దేవ్ కళ్లతో ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్ చక్కగా ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఆ పోస్టు కు శ్రీజ పెట్టిన కామెంట్ అందరికీ బాగా నచ్చింది. ‘నీకు సంతోషంగా ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది. ఆ సంతోషాన్ని చూపించు కల్యాణ్‌దేవ్’ అంటూ శ్రీజ మెసేజ్ పోస్ట్ చేసింది. ఈ పోస్టు అభిమానులకు బాగా నచ్చింది. కల్యాణ్ దేవ్ విజేత మూవీతో హీరో గా మారాడు. తర్వాతి  సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ మళ్ళీ తన రెండో చిత్రంపై దృష్టి పెట్టారు.  ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో  ‘సూపర్‌మచ్చి’ అనే సినిమాలో కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్  కి బ్రేక్ పడగా మళ్లీ ప్రస్తుతం చిత్రీకరణ పనులు జరుగుతున్నాయి.