Begin typing your search above and press return to search.

పెళ్లిసందD హీరోయిన్‌ తప్పటడుగులు!

By:  Tupaki Desk   |   20 Aug 2022 5:28 AM GMT
పెళ్లిసందD హీరోయిన్‌ తప్పటడుగులు!
X
పెళ్లిసందD సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీలా. మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా వెంటనే ఆఫర్లు ఈ అమ్మడి తలుపు తడుతున్నాయి. అదృష్టం కలిసి రావడం అంటే ఇదే అన్నట్లుగా అనిపిస్తున్న ఈ అమ్మడు చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. ఒక్క కమర్షియల్‌ హిట్ లేకున్నా ఇంతగా ఆఫర్లు రావడం అనేది కేవలం ఈమెకే సాధ్యం అయ్యింది.

శ్రీలీలా హీరోయిన్ గా తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ తదుపరి సినిమాల విషయంలో ఈ అమ్మడు జాగ్రత్త పడటం లేదు. వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ కి ఓకే చెప్పడం వల్ల ఈ అమ్మడి అదృష్టంను చేజేతులా నాశనం చేసుకున్నట్లు అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ అమ్మడు కమిట్ అయిన సినిమాలను చూస్తే ఈమె తప్పటడుగులు వేస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పటికే ధమాకా సినిమా లో ఈమె నటిస్తోంది. రవితేజ వంటి సీనియర్ సినిమా లో అది కూడా ఆయన వరుసగా ఫ్లాప్ ల్లో ఉన్న సమయంలో ఆయన సినిమా లో నటించడం అనేది డేరింగ్ విషయమే. ధమాకా ఫలితం ఎలా ఉంటుందో అనేది చూడాలి.

ధమాకా మాత్రమే కాకుండా ఈ అమ్మడు నితిన్ తో ఒక సినిమాలో నటించేందుకు ఇటీవలే ఈమె ఓకే చెప్పింది. నితిన్ కూడా వరుసగా ఫ్లాప్ ల్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయనతో సినిమా అంటే చాలా రిస్కీ ప్రాజెక్ట్‌ అనుకోవచ్చు. ఇక బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబో సినిమా లో కూడా ఈమె కీలక పాత్ర కు ఓకే చెప్పిందట.

ఇప్పుడు డీజే టిల్లు 2 సినిమా లో ఈమె నటించేందుకు ఒప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. స్టార్‌ హీరోల సినిమా ల్లో ఆఫర్లు రాకుంటే వెయిట్‌ చేయాల్సింది పోయి చిన్నా చితకా సినిమాల్లో చేయడం వల్ల కెరీర్‌ మొత్తం కూడా అలాగే నెట్టుకు రావాల్సి వస్తుందని.. ఈ విషయం లో శ్రీలీలా తప్పటడుగులు వేస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.