పెళ్లిసందD హీరోయిన్ 'రాను రాను..' మాస్ డాన్స్

Mon Aug 15 2022 10:04:17 GMT+0530 (IST)

SreeLeela Ranu Ranu Dance Video

పెళ్లిసందD సినిమా తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ శ్రీ లీలా వరుసగా తెలుగు మరియు ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా శ్రీ లీలా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు.ఈ అమ్మడు తాజాగా ఇన్ స్టా లో షేర్ చేసిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన మాచర్ల నియోజక వర్గంలోని ఐటెం సాంగ్ లోని రాను రాను అంటూనే అనే బిట్ కు డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

నితిన్ మరియు అంజలి కలిసి చేసిన డాన్స్ కు ప్రేక్షకులు థియేటర్ లో ఫిదా అవుతున్నారు.. ఇదే సమయంలో శ్రీలీలా ఈ డాన్స్ తో ఇన్ స్టా లో నెటిజన్స్ ను ఫిదా చేస్తోంది.

చిన్నప్పటి ఇష్టమైన సాంగ్.. ఎలా డాన్స్ చేయకుండా ఉంటాను. ఈ పాటు వెండి తెరపై అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాను. మీ సమీప థియేటర్ ల్లో మాచర్ల నియోజకవర్గం సినిమా ఉంది తప్పకుండా వెళ్లి చూడండి అంటూ శ్రీ లీలా డాన్స్ చేయడంతో పాటు పనిలో పనిగా నితిన్ సినిమా కు ప్రమోషన్ చేసింది. తాను కూడా థియేటర్ లో చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

సినిమా ఫలితం గురించి పక్కన పెడితే విడుదల అయినప్పటి నుండి కూడా ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తూనే ఉంది. భారీ ఎత్తున వ్యూస్ ను దక్కించుకుంటూ రికార్డు స్థాయి లైక్స్ ను కూడా పొందింది. అంజలి మరియు నితిన్ వేసిన ఆ సిగ్నేచర్ స్టెప్స్ ను ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ తో పాటు వివిధ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. శ్రీ లీలా చేయడంతో మరింత ఫేమస్ అయ్యాయి.