అగ్ర నిర్మాణ సంస్థలో శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం..!

Sun Sep 25 2022 12:32:23 GMT+0530 (India Standard Time)

Sree Vishnu Project With Hasya Movies Launched Grandly

వర్సటైల్ హీరో శ్రీవిష్ణు విభిన్నమైన చిత్రాలు వవిలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా 'అల్లూరి' సినిమాతో సక్సెస్ అందుకున్న టాలెంటెడ్ యాక్టర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారు. అవి కూడా టాలీవుడ్ లోని స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ లో చేస్తుండటం గమనార్హం.శ్రీవిష్ణు తన కొత్త సినిమా కోసం 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజుతో చేతులు కలపనున్నారు. అగ్ర నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో ఎకె ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈరోజు ఆదివారం ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

ఫన్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనిల్ సుంకర - వీఐ ఆనంద్ - నారా రోహిత్ - విజయ్ కనకమేడల - ఏఆర్ మోహన్ వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు షాట్ కు నారా రోహిత్ క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీవిష్ణు అన్ని రకాల పాత్రలతో మెప్పించినప్పటికీ.. కామెడీ అతని పెద్ద బలం అని చెప్పాలి. అమాయక పాత్ర అయినా.. కన్నింగ్ క్యారక్టర్ అయినా శ్రీవిష్ణు తనదైన టైమింగ్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఈ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో అతను నవ్వించే పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రానికి భాను బోగవరపు కథ అందించగా.. నందు సవిరిగాన డైలాగ్స్ రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్క్రీన్ ప్లే రాసుకున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తుండగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించనున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

ఇందులో శ్రీవిష్ణు తో పాటుగా సుదర్శన్ - శ్రీకాంత్ అయ్యంగార్ - దేవి ప్రసాద్ - ప్రియ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఇతర వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.