శ్రీలీల టైం అలా ఉంది..!

Tue Jan 24 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Sree Leela Back To Back Telugu Movies

కన్నడ భామలకు టాలీవుడ్ లో ఎప్పుడూ లక్ కలిసి వస్తుంది. ఇప్పటికే చాలామంది కన్నడ భామలు తెలుగులో టాప్ హీరోయిన్ గా రాణించగా కొత్తగా రెండు సినిమాలతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుని స్టార్ రేంజ్ కి దూసుకెళ్తుంది శ్రీ లీల. రాఘవేంద్ర రావు పరిచయం చేశారు అంటే ఇక ఆమె టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. పెళ్లిసందD తో శ్రీ లీల టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె నటనతో అందరిని మెప్పించింది. ఇక రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ధమాకా తర్వాత బాలయ్య సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు సైన్ చేసింది శ్రీ లీల. మహేష్ త్రివిక్రం కాంబో సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుంది. అయితే సినిమాలతో పాటుగా ఏదో ఒక విధంగా సోషల్ మీడియా డిస్కషన్స్ లో ఉంటుంది శ్రీ లీల.

ఆమె ఫోటోస్ ఆమె వీడియో క్లిప్స్ ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదంతా అమ్మడు తన పీ.ఆర్ టీం తో చేయిస్తుందా లేక ఆడియన్సే ఆమె గురించి అలా వెతికేస్తున్నారా అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో శ్రీ లీల గురించి బజ్ బాగా ఉంది.

ఇది కచ్చితంగా ఆమె కెరీర్ కు బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ధమాకాలో ఆమె నటనకు డ్యాన్స్ కి ఆడియన్స్ ఇప్పటికే అమ్మడి పేరు కలవరిస్తున్నారు. ఇక రానున్న స్టార్ సినిమాల్లో కూడా శ్రీ లీల ఆకట్టుకుంటే మాత్రం శ్రీలీల కు తెలుగులో తిరుగులేదని చెప్పొచ్చు. కన్నడ భామలంతా తెలుగులో స్టార్డం తెచ్చుకుని మాతృ భాషలో సినిమాలు చేసే తీరిక లేకుండా పోయింది.

చూస్తుంటే శ్రీలీల కూడా తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది కాబట్టి కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటుందని చెప్పొచ్చు. కెరీర్ బిగినింగ్ లోనే శ్రీ లీల ఈ రేంజ్ దూకుడు చూపిస్తుంది అంటే ఆమెకు తప్పకుండా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు.

ధమాకా టైం లో రవితేజ కూడా శ్రీ లీల టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఆ తర్వాత తనతో సినిమా అంటే డేట్స్ ఇస్తుందో లేదో అంత పెద్ద బిజీ ఆర్టిస్ట్ అవుతుందని శ్రీ లీల టాలెంట్ ముందే కనిపెట్టేశాడు రవితేజ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.