Begin typing your search above and press return to search.

స్పైడ‌ర్‌ మ్యాన్‌ - బ్యాట్‌ మ్యాన్ త‌ర‌హాలో 'హ‌ను-మాన్'

By:  Tupaki Desk   |   22 July 2021 7:07 AM GMT
స్పైడ‌ర్‌ మ్యాన్‌ - బ్యాట్‌ మ్యాన్ త‌ర‌హాలో హ‌ను-మాన్
X
ప్రైమ్‌ షో ఎంట‌ర్టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వారు ప్రేక్షకులకు విభిన్నమైన జోనర్ చిత్రాలతో అలరించడానికి సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టారు. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి సారధ్యంలో నడిచే ఈ బ్యాన‌ర్‌ లో రూపొందిన రెండు చిత్రాలు ప్రస్తుతం విడుద‌ల‌కి సిద్దంగా ఉన్నాయి. అలాగే మ‌రో మూడు సినిమాలు సంబంధించిన నిర్మాణం జ‌రుగుతోంది.

ఈరోజు (జులై 22) కె. నిరంజన్ రెడ్డి పుట్టిన‌రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రెగ్యుల‌ర్ సినిమాలే కాకుండా యంగ్ టాలెంట్‌ ని ప్రోత్స‌హించి డిఫ‌రెంట్ కంటెంట్‌ ని ఆడియ‌న్స్ అందించాల‌న్నదే తమ ల‌క్ష్యమని ప్రైమ్‌షో ఎంట‌ర్టైన్‌మెంట్ నిర్మాత తెలిపారు.

- మాది నల్గొండ జిల్లా. నేను హైద‌రాబాద్‌లోనే పుట్టిపెరిగాను. ఇంజ‌నీరింగ్ పూర్త‌య్యాక మాస్ట‌ర్స్‌ చేయ‌డానికి యూఎస్ వెళ్లాను. అది కంప్లీట్ అయ్యాక రెండేళ్లు జాబ్ చేసి ఆ త‌ర్వాత ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ త‌ర్వాత రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టి అక్క‌డా రాణించాం. అయితే సాధార‌ణంగానే సినిమా అనేది మ‌న లైఫ్‌లో ఒక భాగం.

అలానే నాకు సినిమాల‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అందులో భాగంగానే ప్రైమ్ షో ఎంట‌ర్టైన్‌మెంట్‌ ని స్థాపించి నిర్మాణ‌ రంగంలోకి వచ్చాం. భ‌విష్య‌త్తులో ఎగ్జిబిష‌న్ రంగంలోకి వెళ్తాము. అలాగే సొంతంగా ఒక ఓటీటీ పెట్టే ఆలోచ‌న కూడా ఉంది.

- నాకు మంచి టీమ్ కుదిరింది. మా ప్ర‌జెంట‌ర్ చైత‌న్య, అలాగే అశ్రిన్ రెడ్డిగారు వ‌న్ ఆఫ్ మై పార్ట్‌న‌ర్ వారిద్ద‌రికి సినిమా అంటే చాలా ప్యాషన్. ఇక్క‌డ‌ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు వాళ్లే చూసుకుంటారు.

టైమ్‌ కి పూర్తి వ్యాల్యూ ఇస్తాం కాబ‌ట్టే ఒక ఎడాదిలోనే మూడు సినిమాలు చేయ‌గ‌లిగాం. మ‌రో మూడు ప్రాజెక్ట్స్ చేయ‌బోతున్నాం. కొత్త కంటెంట్ ఉండాలి అనేది మా అజెండా. యంగ్ టాలెంట్ ఎవ‌రైనా మా వెబ్‌ సైట్లో ఉన్న ఈ-మెయిల్ అడ్ర‌స్ కు వాళ్ల స్క్రిప్ట్ సినాప్సిస్ మాకు పంపొచ్చు. గ్యారెంటీగా మేము రెస్పాండ్‌ అవుతాము. గ‌తేడాది కాలంలో దాదాపు 200మంది కొత్త టెక్నీషియ‌న్స్ మ‌మ్మ‌ల్ని రీచ్ అయ్యారు.

- ప్ర‌స్తుతం మా బేన‌ర్‌ లో రూపొందిన 'హౌస్ అరెస్ట్' చిత్రాన్ని థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌గానే వెంట‌నే రిలీజ్ చేస్తాం. చిన్న‌పిల్ల‌ల మీద సినిమా వ‌చ్చి చాలా రోజులైంది. త‌ప్ప‌కుండా ఫ్యామిలీస్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే రెండు వారాలలో 'బాయ్‌ ఫ్రెండ్‌ ఫ‌ర్‌ హైర్' చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. అది ప్యూర్ రోమ్ కామ్ స‌బ్జెక్ట్‌.

వీటితో పాటు ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ‌ - తేజ స‌జ్జ కాంబోలో చేస్తున్న 'హ‌ను-మాన్' ఒక సూప‌ర్‌ హీరో మూవీ. ప్ర‌తి సబ్జెక్ట్ ఖ‌చ్చితంగా కొత్త‌గా ఉండాల‌నే ఉద్దేశ్యంతోనే డిఫ‌రెంట్ జోన‌ర్స్‌ లో సినిమాలు తీస్తున్నాం. స్పైడ‌ర్‌ మ్యాన్‌ - బ్యాట్‌ మ్యాన్ త‌ర‌హాలో 'హ‌ను-మాన్' కూడా క్లీన్ యు ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు.

- క‌రోనా స‌మ‌యంలో థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డం చాలా బాధాకర‌మైన విష‌యం. అయితే దానివ‌ల్ల థియేట‌ర్ సిస్ట‌మ్ అనేది క‌నుమ‌రుగైపోతుంది అనేది కేవ‌లం రూమ‌ర్ మాత్ర‌మే. ఎందుకంటే యూఎస్ లాంటి వెల్‌ డెవ‌ల‌పుడ్ కంట్రీలో కూడా ప్రేక్ష‌కులు సినిమాని థియేట‌ర్ల‌లో చూడ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. కాబ‌ట్టి త‌ప్ప‌కుండా థియేట‌ర్స్ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ య‌ధావిధిగా న‌డుస్తాయి. ప్రేక్ష‌కులు ఎప్పుడు సినిమాని థియేట‌ర్ల‌లో చూడ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. అందుకే 'బాయ్‌ ఫ్రెండ్‌ ఫ‌ర్‌ హైర్' 'హౌస్ అరెస్ట్' చిత్రాల‌కి మంచి ఓటీటీ ఆఫ‌ర్ వ‌చ్చినా థియేట‌ర్లో విడుద‌ల‌ చేయడానికి సిద్ద‌మ‌య్యాం.