Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: హాట్ హీరోయిన్స్ న‌గ్న‌త్వం వెన‌క‌

By:  Tupaki Desk   |   16 Jun 2021 4:30 PM GMT
టాప్ స్టోరి: హాట్ హీరోయిన్స్ న‌గ్న‌త్వం వెన‌క‌
X
యువ‌త‌రాన్ని థియేట‌ర్ల‌కు రప్పించాలంటే అందాల క‌థానాయిక‌లతో ప్రేమ క‌థ‌ల్ని.. శృంగార స‌న్నివేశాల్ని రంజుగా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం చాలా ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది. యూత్ ప‌దే ప‌దే థియేట‌ర్లకు వ‌స్తేనే బాక్సాఫీస్ వ‌ద్ద దండీగా క‌లెక్ష‌న్లు సాధ్య‌మ‌ని న‌మ్ముతారు. నాడు నేడు ఎప్పుడూ మంచి క‌థ కంటెంట్ తో పాటు శృంగార స‌న్నివేశాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంది. అయితే అలాంటి స‌న్నివేశాల్లో న‌టించాలంటే క‌థానాయిక‌లు ఎలాంటి ఆచ్ఛాద‌నా లేకుండా క‌నిపించాలి. క్లాసిక్ డేస్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అలా ప్ర‌య‌త్నించిన క‌థానాయిక‌లు ఎంద‌రు ఉన్నారు? అన్న‌ది ఆరా తీస్తే.. ప‌లువురు క‌థానాయిక‌ల జాబితా ఇలా ఉంది.

క్లాసిక్ డేస్ క‌థానాయిక‌లు జీన‌త్ అమ‌న్ .. మందాకిని .. సిమీ గేరేవాల్ .. దీపా సాహి లాంటి బాలీవుడ్ క‌థానాయిక‌లు వెండితెర‌పై న‌గ్న‌త్వంతో అగ్గి రాజేసిన వారి జాబితాలో ఉన్నారు. తొలి త‌రంలో `సత్యం శివం సుందరం`లో జీనత్ శృంగార నాయిక‌గా న‌టించి అర్థ‌న‌గ్న స‌న్నివేశాల్లో హీట్ పెంచిన నాయిక‌గా నిలిచారు. గాజు క‌ళ్ల సుంద‌రి మందాకిని `రామ్ తేరీ గంగా మైలీ` చిత్రంలో జలపాతం కింద చీర‌లో జ‌ల‌కాలాడి నాటి యూత్ కి కంటికి కునుకు క‌రువ‌య్యేలా చేశారు. ఆ త‌ర్వాత అలాంటి స‌న్నివేశాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ నాడు సింహాస‌నం అనే చిత్రంలో రీఇంట్ర‌డ్యూస్ చేశారు. మందాకిని చీర‌లో జ‌ల‌పాతంలో స్నాన‌మాడే సీన్ బ్లాస్ట్ అయ్యింది. సింహాస‌నం బంప‌ర్ హిట్ అయ్యింది.

రాజ్ కపూర్ చిత్రాల్లో జీన‌త్... సిమీ లాంటి తార‌లు అర్థ‌న‌గ్న స‌న్నివేశాల్లో జీవించారు. మేర నామ్ జోకర్ లో సిమీ అగ్గి రాజేసే సీన్ ఇప్ప‌టికీ నాటి యువ‌త‌రం స్ఫుర‌ణ‌కు తెచ్చుకుంటుంది.

జూలీ సినిమాలో నేహా ధూపియా.. మాయా మేమ్ సాబ్ సినిమాలో దీపా సాహీ రొమాన్స్ పీక్స్ లో చూపించారు. ఆల్మోస్ట్ న‌గ్నంగా క‌నిపించారు ఈ భామ‌లు. జ‌హ‌ర్ లో ఇమ్రాన్ హ‌స్మి- ఉదితా గోస్వామి స్ట్రిప్ టీజ్ సీన్ ని యూత్ మ‌ర్చిపోలేదు. ద క్లౌడ్ డోర్ అనే సినిమాలో ఆషిఖి బ్యూటీ అనూ అగర్వాల్ అందాల విందు గురించి చాలా కాలం ముచ్చ‌టించుకున్నారు. ఇక బెబో క‌రీనా క‌పూర్ జీరో సైజ్ గురించి హాట్ నెస్ గురించి అర్థ న‌గ్న స‌న్నివేశాల గురించి డికేడ్ అంతా మాట్లాడుకున్నారు. `ఖుర్బాన్`లో సైఫ్ తో బెబో టాప్ లెస్ న‌ట‌న గుండెల్లో గుబులు రేపింది. హృతిక్ రోషన్ `కైట్స్`లో విదేశీ న‌టి బార్బరా మోరీ శృంగార స‌న్నివేశం తెలిసిందే. `నషా` చిత్రంలో పూన‌మ్ పాండే నిషా ఎక్కించే శృంగార స‌న్నివేశాల్ని మ‌ర్చిపోలేరు. రంగ్ రసియా చిత్రంలో నందనా సేన్ హ‌ద్దులు లేకుండా చెల‌రేగింది.

ల‌స్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో రాధికా ఆప్టే.. కియ‌రా లాంటి భామ‌ల శృంగార స‌న్నివేశాలు .. ఆడై (ఆమె)లో అమలా పాల్ న‌గ్న‌త్వం ఇటీవ‌ల ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. పిసాసు 2 హారర్ మూవీలో ఆండ్రియా న‌గ్నంగా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. ఇక టాలీవుడ్ లో వ‌రుస‌గా డీగ్రేడ్ సినిమాల‌తో చెల‌రేగుతున్న ఆర్జీవీ ఇంత‌కుముందు శృంగార తార మియా మ‌ల్కోవాని జీఎస్టీలో న‌గ్నంగా చూపించారు. ఇటీవ‌ల డీ కంపెనీ చిత్రంలో ప‌లువురు నాయిక‌ల్ని ఆల్మోస్ట్ న‌గ్నంగానే చూపిస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది.