Begin typing your search above and press return to search.

సర్దార్‌ కోసం ప్రత్యేకం సెంట్రల్‌ జైలు

By:  Tupaki Desk   |   9 May 2021 6:32 AM GMT
సర్దార్‌ కోసం ప్రత్యేకం సెంట్రల్‌ జైలు
X
తమిళ హీరో కార్తీ ఇటీవలే సుల్తాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సుల్తాన్ తో కార్తీ కమర్షియల్ గా సక్సెస్ దక్కించుకున్నాడు. ఆ సినిమా సక్సెస్‌ జోష్‌ లో ఉన్న కార్తీ ప్రస్తుతం సర్దార్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే సర్దార్‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల అయ్యింది. ఫస్ట్‌ లుక్ లో గడ్డంతో రఫ్‌ గా కనిపించి కార్తీ సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాడు. కార్తీ తన గత చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ కు కనెక్ట్‌ అయ్యేలా చేస్తున్నాడు. సుల్తాన్ సినిమా తెలుగులో కూడా పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది. దాంతో సర్దార్ పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంది.

సర్దార్‌ సినిమా షూటింగ్ కరోనా సెకండ్‌ వేవ్‌ టైమ్ లో కూడా సాఫీగా సాగుతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం ఒక భారీ సెంట్రల్‌ జైలు సెట్టింగ్‌ ను మేకర్స్‌ నిర్మించారట. తమిళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సెట్టింగ్ లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపనున్నారు. జైలు సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కార్తీ గతంలో కన్న ఈ సినిమాలో మరింత మాస్‌ గా కనిపించబోతున్నాడట.

పీఎస్ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ మూవీకి జీవీ ప్రకాష్‌ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కార్తీకి జోడీగా తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రాశిఖన్నా నటిస్తోంది. తమిళంలో ఇప్పటికే ఈమె కొన్ని సినిమాల్లో నటించింది. ఈ సినిమాతో అక్కడ కమర్షియల్‌ హీరోయిన్‌ గా సక్సెస్‌ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.