Begin typing your search above and press return to search.

'ఆ హీరో పెళ్లి పై నా ఆలోచన మార్చాడు' అంటున్న సౌత్ హీరోయిన్

By:  Tupaki Desk   |   9 July 2020 2:00 PM GMT
ఆ హీరో పెళ్లి పై నా ఆలోచన మార్చాడు అంటున్న సౌత్ హీరోయిన్
X
సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌ అంటే గ్లామర్‌ పాత్రలకు మాత్రమే పరిమితం అవ్వాలి.. అనుకుంటున్న సమయంలో గ్లామర్ పక్కన పెట్టేసి కేవలం నటనకు ప్రాధాన్యం ఇచ్చిన హీరోయిన్ నిత్యామీనన్. కెరీర్ మొదటి నుండి కూడా నిత్య నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ.. స్కిన్‌ షోకు దూరంగా ఉంటూ వస్తుంది. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ.. ఎలాంటి స్కిన్ షో చేయకుండా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్.. మంచి పేరు సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ నటిగా మాత్రం తనని తను నిరూపించుకుంటూ వస్తుంది. ఇప్పటికే నటిగా పలు సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నిత్యామీనన్‌.. ‘ఓకే బంగారం’ సినిమాతో ఇంకాస్త దగ్గరైంది.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం’ సినిమాలో నిత్యామీనన్‌.. దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ హైలైట్ అని చెప్పవచ్చు. తెలుగు, తమిళంలో విడుదలైన ‘ఓకే బంగారం’ సినిమా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. అయితే మనకు నిత్య దుల్కర్ మంచి స్నేహితులుగా మాత్రమే తెలుసు. కానీ వాళ్లు స్నేహానికి మించిన మంచి బంధం ఉందంటున్నారు. ఇప్పటి వరకు దుల్కర్ నిత్యలు కలిసి మూడు సినిమాలలో నటించారు. వీరు నటించిన మూడు సినిమాలు హిట్ అవ్వడమే గాక వీరి పెయిర్ కి మంచి పేరు కూడా తీసుకొచ్చాయి. అయితే జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్న నిత్యమీనన్.. దుల్కర్ సల్మాన్ చెప్తే కన్విన్స్ అయిందట.

ఈ మాటను స్వయంగా నిత్యానే చెబుతోంది. తాజాగా బ్రీత్-2 వెబ్ సిరీస్ లో నటించిన నిత్య.. దాని ప్రమోషన్లలో భాగంగా ఈ విషయం బయటపెట్టింది. దుల్కర్ మంచి ఫ్యామిలీ మ్యాన్.. వివాహ బంధం గురించి నాకు చెప్పి కన్విన్స్ చేసాడు. నా ఆలోచనలో మార్పులు తీసుకొచ్చాడు అని చెప్పుకొచ్చింది అమ్మడు. ఇదిలా ఉండగా నిత్య చివరగా తమిళ సైకో సినిమాలో కనిపించింది. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది. మొత్తానికి అమ్మడు పెళ్లి వైపు పాజిటివ్ గా ఉన్నట్లే అర్ధమవుతుంది.