Begin typing your search above and press return to search.

సౌత్ స్టార్లకు ధైర్యాన్నిచ్చిన సాహో?

By:  Tupaki Desk   |   12 Sep 2019 7:18 AM GMT
సౌత్ స్టార్లకు ధైర్యాన్నిచ్చిన సాహో?
X
టైటిల్ చదవగానే సాహో ఫెయిల్యూర్ తో సౌత్ లో ఉన్న స్టార్ హీరోలు ఎగిరి గంతేస్తున్నారని ఆ..నందంగా ఉన్నారని అనుకుంటారేమో. కాదు. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ ఫలితం ఎలా ఉన్నప్పటికే ఒక విషయంలో మాత్రం 'సాహో' అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే 'సాహో' హిందీ వెర్షన్ సాధించిన విజయం.

కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్నపుడు.. సినిమాకు ఏకగ్రీవంగా హిట్ టాక్ వచ్చినప్పుడు.. మౌత్ టాక్ సూపరంటూ జనాలు చెప్పినప్పుడు ఆ సినిమా హిట్ కావడంలో పెద్ద విశేషం ఏమీ ఉండదు. కానీ 'సాహో' సినిమాను చూసి పెదవి విరిచినవారే ఎక్కువ. రివ్యూలు నెగెటివ్ గా వచ్చాయి. విమర్శకులు చీల్చి చెండాడారు. అయితే హిందీ ఆడియన్స్ కు మాత్రం సినిమా నచ్చింది. దీనికి కారణం ఏంటి అనేది విశ్లేషిస్తే యాభై శాతం సినిమాలో ఉన్న స్టఫ్. పాటలు ఫైట్లు సౌత్ ఆడియన్స్ కు ఎక్కలేదు కానీ అక్కడివారికి నచ్చాయి. ఇక మిగతా ప్రభాస్ క్రేజ్. ఓవరాల్ గా సినిమాకు ప్లస్ అయింది.

అయితే ఇక్కడ సౌత్ స్టార్లకు ధైర్యన్నిచ్చేంత విషయం ఏముంది అంటారా? ఒక సినిమాకు నెగెటివ్ రివ్యూస్.. డిజప్పాయింటింగ్ టాక్ ఉన్నప్పుడు కూడా సినిమా హిట్ అయిందంటే సహజంగా అది సల్మాన్ ఖాన్ సినిమా అని అర్థం. మరి 'కబీర్ సింగ్' కూడా అలానే జరిగింది కదా అని లాజిక్ చెప్పొచ్చు కానీ 'కబీర్ సింగ్' లో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అది మేథావులకు నచ్చినా నచ్చకపోయినా ఆడియన్స్ అందరికీ నచ్చింది. కానీ 'సాహో'లో ఓ అని ఎగిరి గంతేసి జబ్బలు చరుచుకునేంత కంటెంట్ లేదు. 'స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం' అని ఊదరగొట్టారు కానీ అక్కడ అసలు లేనిదే సరైన స్క్రీన్ ప్లే అని జనాల కామెంట్లు వినిపించాయి. అయినా హిందీ జనాలు ఈ సినిమా ను హిట్ చేశారంటే ప్రభాస్ క్రేజే సగం కారణం.

సరిగ్గా ఈ పాయింటే మన సౌత్ స్టార్లకు ధైర్యాన్నిస్తోందనే వాదన వినిపిస్తోంది. గతంలో హిందీ మార్కెట్ లో పాగా వేయడం అంటే అసాధ్యమైన విషయంగా అనుకునేవారు. కానీ రాజమౌళి పుణ్యం కొంత.. డబ్బింగ్ వెర్షన్ సినిమాలు వేసి వేసి మన సినిమాలను హిందీ ప్రేక్షకులకు ఫుల్లుగా అలవాటు చేసిన టీవీ చానెల్స్.. యూట్యూబ్ చానెల్స్ వల్ల కొంత సౌత్ సినిమాలకు ఆదరణ పెరిగింది. సౌత్ హీరోలకు పాపులారిటీ పెరిగింది.

అయినా కూడా కంటెంట్ ఉంటే తప్ప మన సినిమాలను ఆదరించరు అనే అభిప్రాయం ఉండేది.. కానే 'సాహో'తో ప్రభాస్ అది కూడా తప్పని రుజువు చేశాడు. యావరేజ్ బిలో యావరేజ్ కంటెంట్ తో కూడా హిట్ సాధించవచ్చని నిరూపించాడు. ఇప్పటివరకూ హిందీపై పెద్దగా ఫోకస్ చేయని చాలామంది సౌత్ స్టార్లకు ఇది ఖచ్చితంగా షాక్ ఇచ్చి ఉంటుంది. దీనర్థం ప్రయత్నిస్తే హిందీ ఆడియన్స్ కూడా మన స్టార్ల ను సొంతవారిలా ఓన్ చేసుకుంటారని నిరూపితమైంది. ఈమధ్య అందుకే ఏ స్టార్ హీరో సినిమా ప్రస్తావన వచ్చినా ప్యాన్ ఇండియా.. యూనివర్సల్ అప్పీల్.. మల్టి లాంగ్వేజ్ ఫిలిం.. భారీ బడ్జెట్ అనే పదాలు కామన్ అయ్యాయి. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.