Begin typing your search above and press return to search.

రెండు లుక్స్ వదులుతూ బాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పుతున్న సౌత్ ఇండస్ట్రీ..!

By:  Tupaki Desk   |   23 Jun 2021 7:55 AM GMT
రెండు లుక్స్ వదులుతూ బాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పుతున్న సౌత్ ఇండస్ట్రీ..!
X
కొన్ని వందల కోట్లు పెట్టి తీసిన సినిమా అయినా మంచి బిజినెస్ జరగాలంటే బాగా పబ్లిసిటీ చేసుకొని హైప్ క్రియేట్ చేయాలి. దాన్ని జానాల్లోకి తీసుకెళ్లడానికి గట్టిగా ప్రమోషన్స్ చేయాలి. అందుకే సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ - టీజర్ - సాంగ్స్ - ట్రైలర్ అంటూ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాకి బజ్ తేవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రమోషనల్ కార్యక్రమాలలో కొత్త స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు.

కరోనా పరిస్థితులు వచ్చిన తర్వాత సినిమాల ప్రమోషన్స్ అన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ సినిమాలు ఇప్పుడు కొత్తగా రెండు ప్రీ లుక్స్ - రెండు ఫస్ట్ లుక్స్ అనే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రానికి రెండు ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల చేశారు. ఇదే ట్రెండ్ ని అల్లు శిరీష్ 'ప్రేమ‌కాదంట' సినిమా విష‌యంలో కూడా ఫాలో అయ్యారు. రెండు ప్రీ లుక్స్ వదిలి నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యేలా చేశారు.

ఇక నిఖిల్ - అనుపమ పరమేశ్వన్ జంటగా నటిస్తున్న '18 పేజెస్' సినిమా విష‌యంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. తాజాగా ఇళయ దళ‌ప‌తి విజ‌య్ కూడా 'బీస్ట్' చిత్రానికి సంబంధించి రెండు లుక్స్ ని బ్యాక్ టు బ్యాక్ విడుదల చేశారు. ఇలా సౌత్ సినిమా ఇండ‌స్ట్రీ రెండు ఫ‌స్ట్ లుక్స్ వ‌దులుతూ బాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పుతోంది. అయితే ఇలా రెండు లుక్స్ ఒకేసారి విడుద‌ల చేయ‌డానికి రీజ‌న్.. హీరోకి ఓ లుక్.. డైరెక్ట‌ర్ కు మ‌రో లుక్ న‌చ్చ‌డమే అని తెలుస్తోంది. ఏదేమైనా ప్ర‌స్తుతం ఆన్ లైన్ లో జరుగుతున్న ప్ర‌మోష‌న్లలో ఇలా రెండు లుక్స్ ఒకేసారి వ‌దిలే ట్రెండ్ మొద‌లైంద‌నే చెప్పాలి.