టాప్ 10 సౌత్ స్టార్ కిడ్స్

Mon Jan 21 2019 00:10:48 GMT+0530 (IST)

South Indian Stars and Their Kids

మన స్టార్ల ఫ్యామిలీ లైఫ్.. పర్సనల్ లైఫ్ గురించి అభిమానులకు తెలిసేది తక్కువే. ఫలానా హీరోకి ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఆ కుటుంబంలో సభ్యులు ఎంతమంది? అన్నదాని పై పూర్తిగా క్లారిటీ ఉండే అవకాశం లేదు. తమ అభిమాన హీరో ఫ్యామిలీ వరకూ డీటెయిల్స్ లోకి వెళతారు కానీ ఇతర హీరోల ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో మరీ అంతగా తరచి చూడరు. అయితే ఇటీవల సామాజిక మాధ్యమాల వెల్లువలో స్టార్లు తమ ఫ్యామిలీ గురించి వ్యక్తిగత విషయాల్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. దీంతో స్టార్ కిడ్స్ కి బోలెడంత ప్రచారం వచ్చేస్తోంది.సౌత్ లో డజను మంది స్టార్ల వారసులకు సంబంధించిన వివరాల్ని పరిశీలిస్తే.. ``మేం ఇద్దరం మాకు ఇద్దరు`` అన్న తీరుగా ఒక్కొక్క సెలబ్రిటీకి ఇద్దరేసి కిడ్స్ ఉన్నారు. టాలీవుడ్ స్టార్లలో సూపర్ స్టార్ మహేష్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఈ ముగ్గురికి ఇద్దరేసి గారాల పట్టీలు ఉన్నారు. ఈ కిడ్స్ వివరాలు తెలిసిందే. నేచురల్ స్టార్ నానికి అర్జున్ అనే ఓ కుమారుడు - అల్లరి నరేష్ కి అయాన అనే కుమార్తె - గోపిచంద్ కి విరాట్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. సీనియర్ కథానాయిక రమ్యకృష్ణ- కృష్ణ వంశీ జంటకు రిత్విక్ వంశీ అనే కుమారుడు ఉన్నారు. సూర్య - జ్యోతిక జంటకు దియా - దేవ్ అనే కొడుకు- కూతురు ఉన్నారు. చియాన్ విక్రమ్ కుమార్తె అక్షిత కరుణానిధి కజిన్ ని పెళ్లాడింది. కుమారుడు ధృవ్ `వర్మ` (అర్జున్ రెడ్డి రీమేక్) తో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఇలయదళపతి విజయ్‌కి జాసన్ సంజయ్ - దివ్య సాషా అనే కిడ్స్ ఉన్నారు. మోహన్ లాల్ కి ప్రణవ్ - విస్మయ అనే ఇద్దరు పిల్లలు.. మమ్ముట్టి కి ఏకైక వారసుడు దుల్కార్ సల్మాన్ హీరోగా ఏల్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ వారసులు ఐశ్వర్య - సౌందర్య ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె ఐశ్వర్య  హీరో ధనుష్ ని పెళ్లాడారు. ఈ జంటకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కమల్ హాసన్ కు శృతిహాసన్ - అక్షర హాసన్ వారసులు. ఇద్దరూ కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

జయం రవికి ఆరవ్ - అయాన్ అనే ఇద్దరు కిడ్స్ ఉన్నారు. ఖుష్బూ- సుందర్ దంపతులకు అవంతిక - ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయ్ సేతుపతికి సూర్య - శ్రీజ అనే కిడ్స్ ఉన్నారు. శివకార్తికేయన్ కి ఆరాధన అనే కుమార్తె ఉంది. మాధవన్ కి వేదాంత్ (13) అనే కొడుకు ఉన్నాడు. దుల్కార్ సల్మాన్ కి మరియం అమీరా సల్మాన్ అనే కుమార్తె ఉంది. నివిన్ పాళీకి దావుద్ - రోజ్ త్రిష అనే పిల్లలు ఉన్నారు.