సీకే బ్రాండ్ దిశా పటానీకే ఠఫ్ పోటీ ఎదురైందిగా

Thu Apr 22 2021 14:04:55 GMT+0530 (IST)

Soundarya Sharma Latest Stunning Pose

అందాన్ని అందంగా ప్రదర్శించడం ఒక ఎత్తుగడ. అది కొందరికి వ్యసనం. ఇటీవల సోషల్ మీడియాల్లో స్పీడ్ గా ఉన్న భామల్లో సౌందర్య శర్మ ఒకరు. దిల్లీ కి చెందిన డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిన ఈ భామ నటిగా ఎదిగేందుకు చేయని ప్రయత్నం లేదు. ఓవైపు మోడల్ గా రాణిస్తూనే మరోవైపు కథానాయికగానూ పెద్ద ప్లాన్ తో దూసుకెళుతోంది.ఇటీవల సందర్భం ఏదైనా కానీ సౌందర్య శర్మ కాన్సెప్ట్ ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త ఫోటోషూట్ తో అంతర్జాలంలో దుమారం రేపుతోంది. ఈసారి ప్రఖ్యాత బ్రాండ్ ఎంపిరియా ఆర్మనీ లోదుస్తులకు సౌందర్య శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోషన్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ని ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది ఈ బ్యూటీ. ఇన్నర్ ధరించి అందాల ఆరబోతతో అమాంతం హీట్ పెంచింది. అన్నట్టు సీకే బ్యూటీ దిశా పటానీకే సౌందర్య ఠఫ్ కాంపిటీటర్ గా మారుతోందని దీనిని బట్టి అర్థమవుతోంది.

సౌందర్య శర్మ సహజంగానే ఫిట్నెస్ ఫ్రీక్. విభిన్నమైన ఫిట్ లుక్ లో తనని తాను ఎలివేట్ చేసుకునేందుకు ఆసక్తిగా ఉంటుంది. ఇక ఈ భామ నిరంతరం జిమ్మింగ్- యోగా - మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ విద్యలోనూ రాటుదేలుతోందట.

తన ఫిట్ నెస్ రహస్యాన్ని సౌందర్య ఇటీవల వెల్లడించారు. “ ఫిట్నెస్ అనేది నటీమణులకు చాలా ముఖ్యం. అది కూడా చిన్న వయసు నుంచి  అలవాటు పడాలి. నటీనటులు చాలా ఎక్కువ సమయం సెట్స్ లో అలసిపోతారు. అందుకే ఫిట్ నెస్ చాలా ఎక్కువ స్థాయిలో ఉండాలి. ఆహారం ఇందులో చాలా పెద్ద భాగం. ఇది  నిర్లక్ష్యం చేయకూడనిది. శరీరం పనిచేయడానికి సరైన మొత్తంలో ఇంధనాన్ని ఉంచాలి`` అని తెలిపింది. చిట్టి పొట్టి నిక్కర్లలో.. లోదుస్తుల్లో అందాలు ఆరబోసినా ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా ఉంటేనే అందం ఏదైనా అందరికీ కనెక్టవుతుందని ఈ అమ్మడి వాలకం చెబుతోంది.