డాక్టర్ గారి కూతురికి ఈ సినిమా పిచ్చేమిటి?

Mon Mar 01 2021 07:00:01 GMT+0530 (IST)

Soundarya Sharma Latest Photo

సౌందర్య శర్మ .. ముంబై ఫేజ్ 3 ప్రపంచంలో సంచలనంగా మారుతోంది ఈ పేరు.. ఇటీవలి కాలంలో వరుస ఫోటోషూట్లతో వేడెక్కిస్తున్న ఈ భామ నేపథ్యం ఆసక్తికరం. డాక్టర్ల కుటుంబం నుంచి డాక్టర్ కాకుండా కళను నమ్ముకున్న భామగా సౌందర్య పాపులరైంది.తనకు మోడలింగ్ అంటే పిచ్చి.. నటన అంటే ఇంకా పిచ్చి. అందుకే నిరంతరం హాట్ ఫోటోషూట్లతో హీటెక్కిస్తోంది. బికినీ షూట్ స్విమ్ సూట్ అనే విభేధం లేకుండా దేనికైనా సై అనేస్తున్న ఈ భామ ప్రస్తుతం స్టార్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికీ వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తున్న ఈ బ్యూటీ ట్యాలెంట్ నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది.రాంచీ డౌరీస్ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ గాల్ గాడోట్ నటించిన వండర్ ఉమెన్ 1984 చిత్రంలో తళుక్కుమని మెరిసింది.

దిల్లీలో ఫేమస్ డాక్టర్ కుమార్తెగా సౌందర్యకు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఏదేమైనా ఈ అమ్మడు యూత్ లో చక్కని ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా సౌందర్య శర్మ రెడ్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజివ్వగా అది వైరల్ గా మారింది. మేడ్ ఆఫ్ ఏ మ్యాజిక్ అంటూ ఆ థై సొగసుల్ని ఈ ఫోజు ఎలివేట్ చేస్తోంది. ఈ అమ్మడి ట్రీట్ బోయ్స్ ని వేడెక్కిస్తోంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన ఈ అమ్మడి కిల్లర్ లుక్స్ గురించి వాడి వేడి చర్చ సాగుతోంది.