Begin typing your search above and press return to search.

సాటి న‌టిని చెంప దెబ్బ కొట్టి సారీ చెప్ప‌నంది

By:  Tupaki Desk   |   15 Jun 2021 9:30 AM GMT
సాటి న‌టిని చెంప దెబ్బ కొట్టి సారీ చెప్ప‌నంది
X
ఇరువురు క‌థానాయిక‌ల మ‌ధ్య క్యాట్ ఫైట్ చాలా స‌హ‌జ‌మైన‌ది. చాలా కాలం క్రితం ఒక‌ అందాల హీరోయిన్ కి ఆన్ లొకేష‌న్ చెంప చెల్లుమంది.. అలా కొట్టిందెవ‌రు? అంటే సాటి క‌థానాయిక‌. కొడితే కొట్టింది స‌రే.. సారీ చెప్పిందా? అంటే స‌సేమిరా అంది. అంతేనా.. దానికి నేను పూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను.. ఎందుకంటే ఆ దెబ్బ‌కు ఆమె పూర్తిగా అర్హమైనది! అంటూ రివ‌ర్స్ పంచ్ వేసింది.

ఇంత‌కీ ఈ సీన్ ఎవ‌రెవ‌రి మ‌ధ్య‌? అంటే... అమృత రావు.. ఇషా డియోల్ న‌డుమ ఒకానొక‌ ఘోర‌మైన ఘ‌ట‌న అది. ఆ ఇద్ద‌రూ కలిసి 2006 లో `ప్యారే మోహన్` అనే చిత్రంలో న‌టించారు. వివేక్ ఒబేరాయ్ .. ఫ‌ర్దీన్ ఖాన్ ఇందులో హీరోలు.

ఆన్ లొకేష‌న్ ఇషా.. అమృత‌ల‌పై చిత్రీక‌ర‌ణ సాగుతున్న క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్యా మాటా మాటా పెరిగింది. ఆ ఇద్ద‌రిమ‌ధ్యా గొడ‌వ చెంప దెబ్బ‌కు కార‌ణ‌మైంది. ఇషాపై అమృత కొన్ని విప‌రీత‌మైన కామెంట్లు చేయ‌డంతో త‌న ద‌ర్శ‌కుడి ముందే అవ‌మానిస్తావా? అంటూ చెంప చెల్లుమ‌నిపించింది. అలా చేయ‌డానికి కార‌ణం తాను త‌న ఆత్మ గౌర‌వాన్ని కాపాడుకోవ‌డానికేన‌ని ఇషా డియోల్ తెలిపారు.

ఇషా చెంప దెబ్బ ఆ త‌ర్వాత మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. ఆ త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో అమృతను చెంపదెబ్బ కొట్టిన విష‌యాన్ని ఇషా అంగీక‌రించారు. షూటింగ్ పూర్త‌య్యాక‌... నా దర్శకుడు ఇంద్ర కుమార్ .. కెమెరామెన్ ముందు నన్ను ఆమె వేధించింది. హ‌ద్దుమీరి కామెంట్ చేసింది. నా ఆత్మగౌరవం కాపాడటానికి క్షణికావేశంలో చెంపదెబ్బ కొట్టాను. అందుకు నాకు విచారం లేదు. ఎందుకంటే ఆ సమయంలో నా విష‌యంలో ఆమె ప్రవర్తనకు పూర్తిగా అర్హమైనది. నేను నా కోసం.. నా గౌరవం కోసం నిలబడ్డాను.. అని తెలిపారు.

ఇషా డియోల్ ఆ త‌ర్వాత కొంత‌కాలానికి సినిమాల నుంచి వైదొలిగి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. భ‌ర‌త్ త‌క్తానీ అనే బిజినెస్ మేన్ ని పెళ్లాడ‌గా వీరికి రాధ్య - మిర‌యా అనే సంతానం ఉన్నారు. అమృతారావు ఆర్జే అన్మోల్ ని పెళ్లాడి లైఫ్ లో స్థిర‌ప‌డ్డారు.