సోఫీ.. బ్లూ సీని ఈ బికినీ డామినేట్ చేసిందిగా

Wed Jun 09 2021 05:00:01 GMT+0530 (IST)

Sophie Choudry Latest Photo

సింగర్ కం నటి సోఫీ చౌదరి పరిచయం అవసరం లేదు. ఇంతకుముందు మహేష్ 1-నేనొక్కడినే చిత్రంలో ఐటెమ్ నంబర్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈ బ్యూటీ యోగా ఫిట్నెస్ జిమ్ అంటూ నిరంతర ఫోటోషూట్లతో ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తుంటే ఆ ఫోటోలన్నీ వైరల్ గా మారుతున్నాయి.ఇక బీచ్ కనిపిస్తే చాలు అస్సలు విడిచిపెట్టదు సోఫీ. తన విహార యాత్రల్లో సగం బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి చెందినవే.  ఇటీవల ఓ కొత్త వీడియోతో సోఫీ చౌదరి ప్రపంచ మహాసముద్ర దినోత్సవం జరుపుకుంది. ప్రతి సంవత్సరం జూన్ 8 న ప్రపంచ మహాసముద్ర దినోత్సవం జరుపుకుంటారని వెల్లడించింది.

ఈ వీడియోలో సోఫీ చౌదరి మొదట్లో బీచ్ లో కొంత సమయం గడపడం చూడవచ్చు. తరువాత ఆమె సముద్రంలో ఈత కొడుతున్నప్పుడు కొంత డైవింగ్ గేర్ ప్లేను చూడొచ్చు. సముద్రపు డైవింగ్ అనుభవంలో సోఫీ చౌదరి పనితనం ఆశ్చర్యపరుస్తోంది. ఇక బ్లూ సీలో బ్లూ డ్రెస్ తో పాటు గ్రీన్ బికినీలోనూ కనిపించిన సోఫీ మైమరిపించే లుక్ తో కనిపించింది. ఇది త్రోబ్యాక్ ఫోటో.

సముద్రాన్ని కలుషితం చేయకుండా ఉండాలని ఈ సందర్భంగా సోఫీ కోరారు. సముద్రం మన ఆత్మలో అంతర్భాగం. నీరు లేకపోతే ప్రాణం లేదు. కాబట్టి దయచేసి కాలుష్యాన్ని ఆపి రక్షించడం ప్రారంభించండి. ప్రపంచ మహాసముద్ర దినోత్సవ శుభాకాంక్షలు అని సోఫీ చౌదరి తాజా పోస్ట్ లో రాశారు.

అంతకుముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోఫీ పచ్చదనం నడుమ ఉన్న రెండు ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ``ప్రకృతి మధ్య నేను ఎలా ఉన్నానో చూడటానికి స్వైప్ చేయండి`` అని ఆమె శీర్షికలో రాసింది. సోఫీ చౌదరి గాయనిగా వినోద పరిశ్రమలో తన వృత్తిని ప్రారంభించారు. తరువాత MTV లో VJ గా చేరారు. జాయెద్ ఖాన్- ఫర్దీన్ ఖాన్- సంజయ్ దత్- ఇషా డియోల్- షర్మాన్ జోషి- అయేషా టాకియా కలిసి నటించిన `షాదీ నంబర్ 1` చిత్రంతో ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్- కిడ్నాప్- డాడీ కూల్ - వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దోబారా వంటి చిత్రాల్లో కూడా ఆమె నటించింది.