ఫోటో స్టొరీ: బిందాస్ బ్యూటీ ఝకాస్ బికిని

Thu Jun 27 2019 17:28:27 GMT+0530 (IST)

సోఫీ చౌదరి పేరు విన్నారా.. వినే ఉంటారు లెండి.  వినకపోయినా పర్వాలేదు.. ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్.. ఈ భామ అసలు ఇండియన్ భామ కాదు. బ్రిటన్ భామ.  ఎంటీవీ వీజే గా పనిచేసింది.  ఝలక్ దిఖ్లాజా 7 లో పాల్గొంది. మంచి సింగర్ కూడా.  బాలీవుడ్ లో డజనుకు పైగా సినిమాల్లో నటించింది.  ఇక  మహేష్ బాబు సినిమా '1 నేనొక్కడినే' లో లండన్ బాబు పాటకు స్టెప్పులేసింది.  ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో బికినీ ఫోటోలతో హీటు పెంచడంలో స్పెషలిస్టు.  తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా మరోసారి అదేపని చేస్తూ ఒక ఫోటో పోస్ట్ చేసింది సోఫీ. బ్లాక్ కలర్ బికినీ ధరించి సముద్రపు నీటిలో నిలబడింది. పైనేమో ఒక ప్రింటెడ్ షర్ట్ వేసుకుంది.  ఆ షర్టును ధరించింది అనాలో లేక బట్టలను దండేనికి వేలాడదీసినట్టు వేలాడదీసింది అనాలో తెలియడం లేదు.  ఎందుకంటే అందాల వ్యూకు అడ్డురాకుండా వెనక పెట్టుకుంది.   ఈ ఫోటోకు "ఎవరైనా చెప్పారా?" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  దాంతో పాటుగా ఫ్లాష్ బ్యాక్ గురువారం అని.. మాల్దీవ్స్ అని.. వెకేషన్ గోల్స్ అని ఒక పదికి పైగా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చింది. అర్థం అయిందిగా.. మాల్దీవ్స్ లో  కొద్దిరోజుల క్రితం సమ్మర్ టెంపరేచర్ ను పెంచింది.  సైడ్ కు తిరిగి నవ్వుతూ పోజివ్వడంతో ఆమె ఒంపుసొంపుల వయ్యారాలు నెటిజన్లకు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి.

ఈ ఫోటోకు రెస్పాన్స్ సూపర్ గానే ఉంది.  "బిందాస్ బ్యూటీ ఝకాస్ బికిని"..  "నువ్వు న్యాచురల్ గానే చాలా సెక్సీ.. ఈ పోజులు అవసరం లేదు".. "థోడా నమ్కీన్.. థోడా హసీన్" అంటూ కామెంట్లు పెట్టారు.  ఒకరు మాత్రం "దేశి కిమ్ కర్దాషియన్" అన్నారు. దయచేసి ఆ కర్దాషియన్ ఎవరు అని అడక్కండి.. మెజారిటీ కళాపోషకులకు తెలిసే ఉంటుంది.. తెలియని వారు జైబోలో గూగులమ్మ అనండి.. చాలు!