Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ భాయ్ చేయ‌లేనిది ఖిలాడీ చేస్తాడా?

By:  Tupaki Desk   |   19 Oct 2021 6:02 AM GMT
స‌ల్మాన్ భాయ్ చేయ‌లేనిది ఖిలాడీ చేస్తాడా?
X
క‌రోనా సెకండ్ వేవ్ బాలీవుడ్ ని అల్ల‌క‌ల్లోలం చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హారాష్ట్ర స‌హా ఉత్త‌రాది రాష్ట్రాల్లో బంద్ సుదీర్ఘ కాలం కొన‌సాగింది. ఆ క్ర‌మంలోనే స‌ల్మాన్ భాయ్ ఎంతో డేర్ చేసి త‌న `రాధే-మోస్ట్ వాంటెడ్ బాయ్` చిత్రాన్ని ఓటీటీ ప్ల‌స్ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో మ‌ళ్లీ బాలీవుడ్ కి క‌ళ తెచ్చేది ఎవ‌రు? అంటూ డిబేట్ ర‌న్ అవుతోంది. అయితే ఇప్ప‌టికి ప‌రిస్థితులు స‌ద్ధుమ‌ణిగి.. భ‌యాల నుంచి జ‌నం బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఉత్త‌రాదినా సినీప‌రిశ్ర‌మ‌ల్లో ఇప్పుడు కొత్త క‌ళ క‌నిపిస్తోంది.

మ‌ళ్లీ మ‌హ‌రాష్ట్ర వ‌రుస రిలీజ్ ల‌తో షూటింగుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఇటీవ‌లే ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో బాలీవుడ్ సినిమాలు క్యూ క‌డుతున్నాయి. ఇటీవ‌ల డ‌జ‌ను క్రేజీ సినిమాల రిలీజ్ తేదీల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమాల‌న్ని ప్ర‌మోష‌న్ ప‌నుల్లో బిజీ అయ్యాయి. ద‌స‌రా సంద‌ర్భంగా ఇప్ప‌టికే కొన్ని సినిమాలు రిలీజ్ కాగా..తాజాగా దీపావ‌ళి కూడా స‌మీపిస్తుండ‌టంతో మ‌రిన్ని సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. అక్ష‌య్ కుమార్-క‌త్రినాకైఫ్ జంట‌గా రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `సూర్య‌వంశీ` దీపావ‌ళి కానుక‌గా నవంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా `సూర్య‌వంశీ` ముందొస్తుగానే సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

సెన్సార్ నుంచి యుఏ స‌ర్టిఫికెట్ జారీ అయింది. జీరో క‌ట్స్ తో సినిమా థియేట‌ర్లోకి రావ‌డం విశేషం. ఇందులో ఎలాంటి అభ్యంత‌ర‌క స‌న్నివేశాలు లేవ‌ని సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ప్ర‌చార‌మైంది కాబ‌ట్టి వ‌యోలెన్స్ ఎక్కువ‌గా ఉంటుంది.. దాంతో పాటు సెన్సార్ క‌ట్స్ ఎక్కువ‌గా ఉంటాయ‌ని అనుకున్నారు. కానీ సెన్సార్ నుంచి ఎలాంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం కాక‌పోవ‌డమే గాక‌ జీరో క‌ట్స్ తో రిలీజ్ అవుతోంది. ఇక్కడ మ‌రో ఇంట్రెస్టింగ్ సంగ‌తి కూడా ఒక‌టుంది. `సూర్య వంశీ `ర‌న్ టైం 2 గంట‌ల 25 నిమిషాలు. ఇది రోహిత్ శెట్టి కెరీర్ లోనే ఇప్ప‌టివ‌ర‌కూ త‌క్కువ నిడివిగ‌ల సినిమా కావ‌డం విశేషం.

గ‌తంలో ఆయ‌న తెర‌కెక్కించిన `సింబా` 2 గంట‌ల 39 నిమిషాలు కాగా... `గోల్ మాల్ ఎగైన్` రెండు గ‌ట‌ల 31 నిమిషాలు.. `దిల్ వాలే` రెండు గంట‌ల 33 నిమిషాల నిడివితో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. ఆ ర‌కంగా `సూర్య‌వంశీ` కేవ‌లం 145 నిమిషాల నిడివితో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం విశేషం. సినిమా ర‌న్ టైం త‌క్కువ‌గా ఉండ‌టం ప‌ట్ల నిపుణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా లెంగ్త్..ర‌న్ టైమ్ త‌క్కువ‌గానే ఉండాలి. ఇలా ఉంటేనే వీలైన‌ని షోలు వేయ‌డానికి ఆస్కారం ఉంటుంది. ఇది మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ కి కలిసొచ్చే అంశమ‌ని పేర్కొన్నారు. అక్ష‌య్ క‌మార్ న‌టించిన బెల్ బాట‌మ్ ఇటీవ‌ల రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే సూర్య‌వంశీ పై ఆ ప్ర‌భావం లేదు. కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ల స్పెష‌లిస్టుగా రోహిత్ శెట్టి ప‌నితనం తో ఇది హిట్ట‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇంత‌కుముందు స‌ల్మాన్ భాయ్ డిజాస్ట‌ర్ అందుకున్నాడు. ఆ త‌ర‌వాత బెల్ బాట‌మ్ తో ఖిలాడీకి పంచ్ ప‌డింది. కానీ ఖిలాడీ ఇప్పుడు మెరిపిస్తాడ‌నే ఆశిస్తున్నారు. ప‌రాజ‌యాల‌తో క‌ళ త‌ప్పిన బాలీవుడ్ ని గాడిలో పెట్టేవాడు అవుతాడా లేదా? అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.