ఖాన్ లకు అయినా అంత ఫాలోయింగ్ లేదు సుమీ

Sat Jul 31 2021 14:11:56 GMT+0530 (IST)

Sonu Sood Fans Celebrate His Birthday

బాలీవుడ్ లో ఖాన్ లకు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ఖాన్ ల త్రయం దశాబ్ధాల పాటు ఏల్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా షారూక్.. అమీర్ .. సల్మాన్ వంటి వారికి ఉన్న ఫాలోయింగ్ అసాధారణం. అయితే వీళ్లందరినీ తలదన్నేవాడిగా రియల్ హీరోగా వెలిగిపోతున్నాడు సోనూసూద్. బాలీవుడ్ దిగ్గజ ఖాన్ లనే తలదన్నే రీతిలో సోనూ క్రేజ్ అమాంతం పెరిగిందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ కావాలా?తాజాగా సోనూసూద్ ఇంటి ముందు జనం రౌండప్ చేసారిలా. సోనుసూద్ క్రేజ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. నటుడిగా కన్నా మంచి మనసుకున్న వ్యక్తిగా సోనుసూద్ ఇప్పుడు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అన్నది వాస్తవం. ఒక్క కరోనా క్రైసస్ ఆయన్ని ఆయనలో గొప్పదనాన్ని బయటపెట్టింది. ప్రభుత్వాలే చేయని గొప్ప పనులు చేసి సోనుసూద్ మానవతా వాదిగా నిరూపించుకున్నారు. కరోనా క్రైసస్ లాక్ డౌన్ లో ప్రభుత్వాలే చేతులెత్తేస్తే..  తానే స్వయంగా బస్సుల్ని నడిపి వలస కార్మికుల్ని సొంత రాష్ట్రాలకు తరలించిన సంగతి తెలిసిందే. ఆ క్షణమే అతడు మనుషుల్లో దేవుడయ్యాడు.

ఆ తర్వాత కొవిడ్ సెకెండ్  వేవ్ సమయంలోనూ ఎంతో మంది నిరుపేదలకు ఖరీదైన మందులు పంపిణీ చేసి దాతృ హృదయం చాటుకున్నారు. ఈ రెండు  సన్నివేశాల్ని సోనుసూద్ ని మహా సేవికుడిగా అగ్ర పథాన నిలబెట్టాయన్నది వాస్తవం. సోనూసూద్ లానే ఎందరో కొన్ని మంచి పనులు చేసినా వాటికి అంత గుర్తింపు రాలేదు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సీసీసీ సేవలకు కానీ.. ఆక్సిజన్ సిలిండర్లు  పంపిణీ సేవలకు కానీ ఆశించినంత గుర్తింపు రాలేదు. చిరు అంత చేసినప్పటికీ మీడియా అంతగా ఆయన్ని ఫోకస్ చేయలేదు.  ఇక ఆ ఇద్దరి సేవల్ని ప్రజలు మాత్రం గొప్పగా గుర్తించారు. సోషల్ మీడియాలే వారిని దేవుళ్లుగా ప్రకటించాయి. ముఖ్యంగా సోను సూద్ రియల్ హీరోగా నిలబెట్టాయి మీడియాలు. ఇక క్రైసిస్ లో ఖాన్ లు కొన్ని సేవలు చేసారు.. కానీ సోనూ అంతగా కాదు. అయితే ఖాన్ ల ఆదాయం రేంజుకు తగ్గ సేవలు కావని కూడా జనం లైట్ తీస్కున్నారు అప్పటికి.

సోనూ సూద్ పలుకుబడిని వినియోగించుకునేందుకు ఇప్పటికే పలు  రాజకీయ పార్టీలు తమ పార్టీలో చేరమని  ఆహ్వనించాయి. ఇదంతా ఒక ఎత్తైతే జులై 30న సోను సూద్ బర్త్ డేని ముంబైలో ఆయన అభిమానులు ఇంటి ముందు ఎంతో ఘనంగా నిర్వహించారు.  భారీ ఎత్తున అభిమానులు సోను ఇంటికి తరలి వచ్చి విషెస్ తెలియజేసారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అయితే ఇప్పటివరకూ మెంబై ఖాన్ లలో ఏ హీరో బర్త్ డేకి ఇలా జరగలేదు. ఇంత మంది అభిమానులు ఇంటి ముందుకు వచ్చి గుమి కూడింది లేదు. ఒక్క సోనూసూద్ కి మాత్రమే ఇలాంటి గౌరవం దక్కింది.