సోనూ సూద్ పాలిటిక్స్ లోకి వస్తాడా?

Tue Jul 28 2020 14:00:08 GMT+0530 (IST)

Sonu sood reveals about his political entry

కరోనా లాక్ డౌన్ సమయంలో చేతికే ఎముకే లేకుండా వలస కూలీలు సహా అన్నార్థులను ఆదుకొని ఫేమస్ అయ్యారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. అడిగిన వారికి.. అడగని వారికి.. తనకు కనిపించిన వారందరికీ సాయం చేస్తూ పోయారు.తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ పేద రైతు కష్టాన్ని చూసి ట్రాక్టర్ ను పంపించాడు.అయితే సోనూ సూద్ ఇంత నిస్వార్థంగా సేవ చేస్తుండడంతో అందరూ ఆయననే సాయం కోసం ట్విట్టర్ లో అడుగుతున్నారు. ఇక ప్రభుత్వాలకు పన్నులు కట్టకుండా సోనూ సూద్ కే తాము పన్ను కడుతామంటూ కొందరు నెటిజన్లు సోనూను అభినందిస్తున్నారు.

అయితే ఇంత సేవ చేస్తున్నారు.. రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయొచ్చు కదా అని తాజాగా సోనూ సూద్ ను ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూ చేయగా ఆసక్తికరంగా స్పందించారు. సేవ చేయాలంటే రాజకీయాల్లోకే రావాల్సిన అవసరం లేదని.. యాక్టర్ గానూ చేయవచ్చని సోనూ సూద్ తెలిపారు. తనకు నటన అంటే ఇష్టమని.. ఇంకో పదేళ్ల వరకు తెలుగు బాలీవుడ్ సహా అన్ని భాషల చిత్రాలు చేస్తూ ఉంటానని.. తనకు సినిమా అవకాశాలు బాగానే ఉన్నాయని సోనూ సూద్ తెలిపారు.

ఇంకో పదేళ్ల వరకు సినిమా అవకాశాలు లేకపోతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని.. అప్పటిదాకా సినిమాలు చేస్తూ ఉంటానని సోనూ సూద్ తెలిపారు.

అయితే సోనూసూద్ కు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ చూశాక.. ఆయనను చేర్చుకోవాలని ప్రధాన రాజకీయా పార్టీలన్నీ కాచుకు కూర్చున్నాయి. సోనూ ఓకే చెప్పడమే ఆలస్యం.. ఆయనను ఎన్నికల్లో నిలబెట్టి ఈజీగా గెలువచ్చు అని భావిస్తున్నాయి. కానీ సోనూ మాత్రం ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని తెలుస్తోంది.