Begin typing your search above and press return to search.

ఇండియాస్ బిగ్గెస్ట్‌ మూవీని మిస్ చేసుకున్న రియల్‌ హీరో

By:  Tupaki Desk   |   25 Jun 2022 11:30 PM GMT
ఇండియాస్ బిగ్గెస్ట్‌ మూవీని మిస్ చేసుకున్న రియల్‌ హీరో
X
ఇండియాలో కరోనా అనే పదం వినిపించిన వెంటనే వెంటనే గుర్తుకు వచ్చే విషయాల్లో సోనూ సూద్‌ చేసిన ఛారిటీ కూడా గుర్తుకు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా ఫస్ట్‌ వేవ్‌ మరియు సెకండ్‌ వేవ్‌ సమయాల్లో ఆయన నుండి సహాయం పొందిన వారు వందల్లో కాదు వేలల్లో ఉన్నారు. వందల మందికి ఆక్సిజన్ అందించడం వల్ల ప్రాణాలతో బయట పడ్డారు.

అలాంటి సోనూ సూద్‌ సినిమాలతో ళ్లీ బిజీ అయ్యాడు. ఇటీవలే చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కనిపించిన సోనూసూద్‌ మరో వైపు రెండు తెలుగు సినిమాల్లో కూడా నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. తెలుగు లో కాకుండా హిందీలో కూడా సోనూసూద్‌ ప్రథాన పాత్రలో సినిమాలు రూపొందబోతున్నాయి అంటూ ఉత్తరాది మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ రియల్‌ హీరో ఇండియాస్ బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ మూవీ అయిన బాహుబలి 2 సినిమాలో వచ్చిన అవకాశంను మిస్ చేసుకున్నాడట. చిన్న పాత్ర అయినా కూడా ఎక్కువ రోజుల పాటు డేట్లు అడగడం వల్ల రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌ ను సోనూసూద్‌ తిరష్కరించాడట. ఈ విషయాన్ని స్వయంగా సోనూ సూద్‌ ఇటీవల ఒక చిట్‌ చాట్‌ సందర్బంగా తెలియజేయడంతో ఆ విషయం కాస్త వైరల్‌ అయ్యింది.

సోనూసూద్‌ మాట్లాడుతూ... రాజమౌళి గారు బాహుబలి 2 సినిమా కోసం నన్ను సంప్రదించారు. ఆ సమయంలో బల్క్‌ డేట్లు కావాలని అడిగారు. అప్పుడు నా కమిట్‌మెంట్స్ వల్ల రాజమౌళి గారు అడిగిన డేట్లు ఇవ్వలేక పోయాను. ఆ డేట్స్ సర్దుబాటు కాక పోవడంతో నేను ఆ సినిమాను చేయలేక పోయాను అన్నాడు.

బాహుబలి 2 లో ఏ పాత్రకు రాజమౌళి తనను కమిట్‌ అయ్యాడు అనే విషయాన్ని మాత్రం సోనూసూద్‌ తెలియజేయలేదు. అయినా వారి మధ్య డేట్ల విషయం వరకు చర్చ జరిగి ఉంటుంది. డేట్లు ఓకే అయ్యి ఉంటే అప్పుడు పాత్ర ఏంటీ అనే విషయంలో రాజమౌళి ఒక క్లారిటీ ఇచ్చే వాడేమో.

ఇంతకు ఇప్పుడు మనం చూసిన.. చూస్తున్న బాహుబలి 2 లో రాజమౌళి ఏ పాత్ర కోసం సోనూసూద్‌ ను అడిగి ఉంటాడు అంటే కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంది. ఇంతకు ఆయన ఏ పాత్రకు సెట్‌ అవుతాడని రాజమౌళి భావించాడో తెలియాలంటే.. రాజమౌళి ఈ విషయం గురించి నోరు విప్పాల్సిందే.