Begin typing your search above and press return to search.

మీ హృద‌యం రెంట్ కి ఇస్తారా?

By:  Tupaki Desk   |   26 Sep 2021 4:30 AM GMT
మీ హృద‌యం రెంట్ కి ఇస్తారా?
X
`జాదుగాడు` చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముంబై బ్యూటీ సోనారికా భాండారియా సుప‌రిచితురాలే. తొలి సినిమా అమ్మ‌డికి చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. అయినా మ‌రో రెండు..మూడు ఛాన్సులు వెంట వెంట‌నే అందుకుంది. `స్పీడున్నోడు`..`ఈడో ర‌కం ఆడో ర‌కం` చిత్రాల్లో న‌టించింది. అయినా లాభం లేక‌పోయింది. దీంతో సోనారిక ఏకంగా మకాం మార్చేసింది. హిందీ చిత్ర సీమ‌లో బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. బాలీవుడ్ లో ఓ రెండు చిత్రాల్లో నటించింది. కానీ అక్క‌డా క‌లిసి రాలేదు. దీంతో అమ్మ‌డికి పూర్తిగా అవ‌కాశాలు లేకుండా పోయాయి.

అయితే అప్ప‌టికే సోనారికా బుల్లి తెర‌పై ఫేమ‌స్ అయింది. కొన్ని షోస్ తో ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. క‌రోనా రాక ముందు వ‌ర‌కూ టీవీ షోల‌తో బిజీగానే గ‌డిపింది. కానీ ఆ త‌ర్వాత అక్క‌డా ప్ర‌తికూల ప‌రిస్థితులే ఎదుర‌య్యాయి. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌టం త‌ప్ప‌! చేసేదేం లేదు. ఇన్ స్టాలో హాట్ ఫోటోల‌తో కైపెక్కించ‌డ‌మే ప‌నిగా ముందుకు సాగుతోంది. తాజాగా సోనారికా స్కిన్ టైట్ ఫిట్ లో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది. స్కిన్ టోన్డ్ బాడీతో మ‌రిపించింది. టాప్ లో క్యాజువ‌ల్ ష‌ర్ట్ ధ‌రించింది. కురుల‌తో ముఖం స‌గ‌బాగాన్ని క‌ప్పేసింది. రెండు క‌ళ్లు మూసుకుని ఇచ్చిన ఫోజ్ ఇప్పుడు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది.

పిక్ ని ఉద్దేశించి సోనారికా ఓ చిన్న కొటేష‌న్ కూడా ఇచ్చింది. మీ హృద‌యాలు ఖాళీగా ఉంటే కొంచెం అద్దెకు ఇవ్వండి అంటూ వ‌ల‌పు బాణం వేసింది. దీంతో ఫాలోవ‌ర్స్ కామెంట్స్ పీక్స్ లో ప‌డుతున్నాయి. ల‌వ్ బుల్ ఎమోజీలు..ఫన్నీ ఎమోజీలు..టెంప్టింక్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. మ‌రి ఈ క్రేజీనెస్ సోనారికా ప్రోఫెష‌నల్ కెరీర్ కి ఏమైనా ఉప‌యోగ ప‌డుతుందేమో చూద్దాం.