జన్మంతా గుర్తుంచుకునేలా విష్ చేసిన సోనారికా!

Wed May 18 2022 14:00:37 GMT+0530 (IST)

Sonarika Bhandaria Birthday Wishes

'జాదుగాడు' ఫేం సోనారికా భాండారియా- వికాష్ పరాశర్ అనే యువకుడితో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట అన్యోన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు క్లోజ్ గామూవ్  అయిన ఫోటోలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. దీంతో మీడియాకి మరో ఛాయిస్  ఇవ్వకుండా  ప్రేమలో ఉన్నాం..పెళ్లి కూడా చేసుకుంటామని! ముందే చెప్పేసారు.



ఇప్పుడు చెప్పిన మాటని నిలబెట్టుకునే పనిలో  ఉందీ జంట.  ఇటీవలే నిశ్చితార్ధం కూడా జరిగింది. త్వరలో వివాహ బంధంతో ధాంప్యత జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా నేడు ప్రియుడు పుట్టిన రోజు సందర్భంగా సోనారికా సఖుడిపై తనకున్న ప్రేమనంతటని  కురిపించేసింది.

''బంగారం..చిట్టి..కన్న..నా శ్వాస..నా ధ్యాశ అంటూ తనలో అమర ప్రేమికురాల్ని చూపించింది. బీచ్ లో ప్రియుడుకి పుట్టిన  రోజు శుభాకాంక్షలు చెప్పి తన ప్రేమంతా చూపించేసింది. వాటిని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇలా ఇద్దరు ఇందులో తెలుపు వర్ణం దుస్తుల్లో కనిపిస్తున్నారు. బీచ్ లో ఇసుక రంగులో కలిసిపోయారు. జంటగా మోకాళ్లపై కూర్చుని ఒకర్ని ఒకరు ప్రపోజ్  చేసుకున్నారు. వెనుక వైపు అందమైన సముద్రం...ఆపైన అద్భుతమైన ఆకాశం రంగు లో జంట ఆహా అనిపించారు. ఇక ప్రియుణ్ణి ఉద్దేశించి సోనారియా ఏమందో ఆమె మాటల్లోనే  తెలుసుకుందాం.

'వికాష్ నా బంగారం. నా ఆత్మ. ఎంతో మంచి వాడు..దయా హృదయం గలవాడు. ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా మనస్సు.. నా హృదయం.. నా ఆత్మ  నాలోని ప్రతీది వికాష్ కి సొంతం. అతను నాలో సగ భాగం. నన్ను ఎంతో బాగా..సురక్షితంగా చూసుకుంటాడు. అతనితో ఉంటే నాకెలాంటి భయాలు ఉండవు.

మనసు ప్రశాంతంగా ఉంటుంది. అతను నా అతి పెద్ద సాహసం. ఎప్పుడూ నా ముందు దృఢంగా నిలబడతాడు.  ప్రతిరోజూ నన్ను కోరుకునే  అబ్బాయి.  ఎప్పుడూ  నాకు మద్దతుగా నిలుస్తాడు. తన హృదయంలో నాకంటూ ఓ అద్భుతమైన ఇల్లు కట్టాడు. నాపై ప్రేమని..ఆ ఇంటిని ఎంతో జాగ్రత్తో చూసుకుంటున్నాడు' అని రాసుకొచ్చింది.

సోనారికా 'జాదుగాడు' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  అటుపై  'స్పీడున్నోడు'..'ఈడో రకం ఆడో రకం' లాంటి సినిమాల్లో నటించింది. ఈవేవి సక్సెస్ అవ్వలేదు. దీంతో టాలీవుడ్ లో మరో ఛాన్స్ రాలేదు. చేసేదేం లేక బాలీవుడ్ కి వెళ్లిపోయింది.  అక్కడో  రెండు సినిమాల్లో నటించింది. అటుపై అక్కడా ఖాళీనే. ఆమె సినిమా చేసి ఐదేళ్లు అవుతుంది. అంటే సినిమా కెరీర్ ఇక ముగిసినట్లే.  ప్రస్తుతం టెలివిజన్ షోస్ ని హోస్ట్ చేస్తుంది. అక్కడింకా అంత బిజీ కాలేదు. అమ్మడు కెరీర్ బుల్లి తెరపైనే ప్రారంభమైంది. మళ్లీ అక్కడికి వెళ్లింది.